NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ap politics : ఆంధ్ర లో బీహార్ సంస్కృతికి స్వాగతం!!

Ap politics : ఆంధ్ర లో బీహార్ సంస్కృతికి స్వాగతం!!

Ap politics : నిన్న మొన్నటి వరకు బీహార్ రాజకీయాలంటే దేశవ్యాప్తంగా ఒకరకమైన భయం ఉండేది. కేవలం అక్కడ రౌడీలు గుండాల ఆధిపత్యంతో పాటు… గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుందని… రాజకీయం చేయడం అంత సులభం కాదు అనేది దేశ వ్యాప్తంగా పేరుంది. రాజకీయ శత్రువులను భౌతికంగా కూడా గాయపరుస్తు, సజ్జలు చేసేందుకు సైతం అక్కడ రాజకీయ నేతలు రాజకీయ పార్టీలు వెనకాడవని ఓ పేరుండేది.. అయితే అలాంటి గొప్ప సంస్కృతి అలాంటి గొప్ప రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రాలో సైతం ప్రవేశించినట్లు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి పై మంగళవారం పట్టపగలే విజయవాడలోని తన ఇంట్లో కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాదు ఆయన కారును సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. పట్టాభి కి గాయాలు అయ్యాయి కానీ.. ప్రాణాపాయం ఏమీ లేదు. అయితే దాడుల సంస్కృతి ఏపీ రాజకీయాల్లోకి Ap politics రావడం ఆందోళన కలిగిస్తోంది.

Ap politics : is bihar politics comes in
Ap politics : is bihar politics comes in

మంత్రి కొడాలికి ముడి!

పట్టాభి దాడి విషయంలో టీడీపీ నేతలు వెంటనే మంత్రి కొడాలి నాని కి ఈ దాడిని ముడిపెట్టి మాట్లాడడం చూస్తే కావాలనే దీన్ని రాజకీయంగా పెద్దది చేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. పోలీసుల ప్రాథమిక విచారణ దర్యాప్తు ఏమీ లేకుండానే దాడి చేసిన వ్యక్తులు కొడాలి నాని పంపిన వ్యక్తులని టిడిపి ఆరోపించడం లో న్యాయం కనిపించడం లేదు. ఇటీవల పట్టాభి మంత్రి కొడాలి నాని ను ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు కొన్ని సవాళ్లు విసిరారు. మంత్రి కొడాలి నాని ఏం మాట మాట్లాడినా టిడిపి తరఫున ముందు గా ప్రెస్ మీట్ పెట్టి కొడాలి నాని మేధా విరుచుకుపడడం లో పట్టాభి ముందుంటున్నారు. ఈ కారణం చేతే మంత్రి కొడాలి నాని తన మనుషుల్ని పంపించి పట్టా భూమి మీద దాడి చేయించారు అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం. అసలు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండానే మంత్రి మీద ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి లేదా సానుభూతి పొందాలని చూడడం టీడీపీ చేస్తున్న కొత్త రాజకీయం. ఖచ్చితంగా పట్టాల మీద వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లేదా నాయకులు అనుచరులు దాడి చేశారని చెప్పడానికి ప్రత్యేకమైన ఆధారాలు ఏవీ ప్రస్తుతం కనిపించడం లేదు. పట్టాభి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అంతలోనే టిడిపి నాయకులు దీనిని నానా హడావుడి చేసి టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పట్టాభి ఇంటికి వెళ్లి… వైసీపీ నాయకుల దాడులే అన్నట్లు మాట్లాడడం ఇరు పార్టీల మధ్య ఘర్షణ ఆత్మకథ వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది తప్ప… ఈ కేసులో నిజానిజాలు బయటకు రావడానికి ఏ మాత్రం ఉపయోగపడదు. పోలీసులకు కనీసం దర్యాప్తు చేసే అవకాశం విచారణ చేసే సమయం ఇవ్వకుండా చంద్రబాబు రాగానే టీడీపీ నేతలంతా సీఎం నివాసానికి వెళ్లడాన్ని చూస్తే ఈ కేసును ఖచ్చితంగా రాజకీయ వివాదం చేయడానికి మాత్రమే టిడిపి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

సీసీ కెమెరాల్లో దుండగులు!

దాడి జరిగిన సమయంలో పట్టాభి ఇంటి చుట్టుపక్కల ఉన్న పలు భవనాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరించారు. దానిలో ఓ యువకుడు బైక్ మీద బయట కాపలాగా ఉంటే మరికొందరు పట్టాభి ఇంటి లోపలికి వెళ్ళి విధ్వంసం సృష్టించినట్లు అర్థమవుతోంది. మొత్తం ముగ్గురు వ్యక్తులు దీనిలో పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. అసలు వారు ఎవరు ఏమిటి?? అన్న ప్రాథమిక విషయాలు సైతం ఇంకా తెలియలేదు. పట్టాభి కి వ్యాపారపరంగా ఏమైనా శత్రువులు ఉన్నారా?? అనే కోణం కూడా పరిశీలించాల్సి ఉంది. అవేవీ లేకుండా నే మంత్రి కొడాలి నాని అనుచరులు వచ్చి పట్టాల మీద దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు కావాలనే భౌతికంగా ఢీ కొట్టారని… రకరకాలుగా టిడిపి ప్రచారం చూస్తుంటే.. కేసు మొత్తం మంత్రి కొడాలి నాని మీదకు వెళ్లేలా, కొడాలి నాని ఈ మధ్యకాలంలో టిడిపి మీద దూకుడుగా వెళ్తున్న సమయంలో ఆయనకు ఈ కేసు మొత్తం రుద్దేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేసి పట్టాభి వారితో పాటు ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు అన్న దాని మీద విచారణ చేస్తే కాస్త ఫలితం ఉంటుంది. వచ్చిన వ్యక్తులు ఏం మాట్లాడారు దేని గురించి పట్టాల మీద దాడి చేశారు ఘర్షణ ఏమైనా జరిగిందా?? అన్న విషయాలను సైతం నిర్ధారించవలసి ఉంది. ఏదిఏమైనా వైసీపీ టీడీపీల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం ఇప్పుడు బౌతిక దాడులు వరకు రావడం నిజంగా భయం గోల్పిస్తోంది. నాయకులు మాటలు మీరీ ఇష్టానుసారం మాట్లాడితే అది ఖచ్చితంగా కార్యకర్తల, మీద ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం తర్వాత ఫలితాలు ఇలాగే ఉంటాయి… దీనిలో కచ్చితంగా వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు ప్రోద్బలం ఉందని చెప్పలేం గానీ… ఓ రాజకీయ నాయకుడు అందులోనూ ఒక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా వ్యవహరిస్తున్న వ్యక్తి మీద భౌతిక దాడులు జరిపితే కచ్చితంగా అధికార పార్టీ కు, మచ్చే.

 

author avatar
Comrade CHE

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!