AP Polycet 2022: రాష్ట్రంలో పాలిటెక్నిక్ లో ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. పాలిటెక్నిక్ లో ప్రవేశానికి ఈ నెల 29న పాలిసెట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి వివరాలను శనివారం పోలా భాస్కర్ మీడియాకు విడుదల చేశారు. ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్ధులు పది గంటల నుండి పరీక్షా కేంద్రాలలోకి అనుమతి ఇస్తామని తెలిపారు. పాలిసెట్ కి 1,37,371 మంది విద్యార్ధినీ విద్యార్ధులు ధరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్ష నిర్వహణకి 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పాలిసెట్ ని 120 మార్కులకు నిర్వహిస్తున్నామనీ, ఇందులో లెక్కలు 50 మార్కులు, భౌతిక శాస్త్రం లో 40 మార్కులు, రసాయనిక శాస్త్రంలో 30 మార్కులకి పరీక్ష ఉంటుందని చెప్పారు. పాలిసెట్ లో కనీసం 30 మార్కులు సాధించిన ఒసి, బీసీ విద్యార్ధులకి ర్యాంకులు ఇస్తామని తెలిపారు. ఫలితాలను పది రోజులలో ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల్లో 29 బ్రాంచ్ లలో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,004 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల్లో 53,565 సీట్లు మొత్తంగా 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఫీజు రూ.4700లు, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల్లో 25వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకి బిటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి అవకాశం ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…