NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ స్పీక‌ర్… మ‌ళ్లీ ఇలా వార్త‌ల్లోకి వ‌స్తున్నారేంటో!

కొద్దికాలం క్రితం వ‌ర‌కు సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచిన ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో అమ‌రావ‌తి, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు, తెలుగుదేశం పార్టీ నేత‌లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న కోర్టులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోర్టుల తీర్పులు భరించలేక… జనం ఏదో ఒక రోజు ఉద్యమిస్తే తెలుస్తుందన్నారు.

జ‌గ‌న్ మౌనం… త‌మ్మినేని సంచ‌ల‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కళ్ళు,చెవులు లేని ప్రతిపక్షం ఉందని త‌మ్మినేని సీతారం మండిప‌డ్డారు. పేదలకు సంక్షేమం అందకపోతే ప్రతిపక్షం పోరాడాలి అంతేకాని కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకోవడం స‌రైన ప‌‌ద్ద‌తి కాదని అన్నారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టలు ఇవ్వకుండా అడ్డుకుంటే… పేదలు ఊరుకుంటారా అని తమ్మినేని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటే మూల్యం చెల్లిస్తారని త‌మ్మినేని సీతారాం అన్నారు. సీఎం జగన్‌ ఎందుకో మౌనం వహిస్తున్నారని… మౌనం బద్ధలైతే ప్రళయం వస్తుందన్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు.

బాబును లోప‌ల వేసేయ‌డం ఖాయ‌మే

అమరావతిలో టీడీపీ నేత‌లు అందిన కాడికి దోచుకున్నార‌ని త‌మ్మినేని సీతారం ఆరోపించారు. అమరావతి విషయంలో సీబీఐ విచారణ వద్దంటున్నార‌ని వాళ్లంతా దొరలమన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. 26 కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నాడన్న చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోమనండని సవాల్ చేసారు. చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదన్న ఆయన లేనిపోని వెధవ పనులు చేసి సిబిఐ విచారణ వద్దంటున్నారని అన్నారు. గతంలో పేదలు ఇళ్ల కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగి దండం పెట్టేసేవారని అన్నారు.

గ‌తంలోనూ ర‌ఘురామ కృష్ణంరాజుపై…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం లోక్‌స‌భ స‌భ్యుడు రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై కూడా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స్పందించారు.ఏపీ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే నరసాపురం ఎంపీ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న ఆయ‌న‌.. పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవ‌చ్చు అని వ్యాఖ్యానించారు. పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న ర‌ఘురామ‌కృష్ణంరాజుపై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ స్పీక‌ర్ కోరారు.

అమ‌రావ‌తి విష‌యంలోనూ….

ఏపీ రాజధాని అమరావతిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్న తరుణంలో స్పీకర్ తమ్మినేని సీతారాం విస్మయం కలిగించేలా వ్యాఖ్యానించారు. ఏపీ రాజధానికి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మిగిలిన వాళ్లు బహిరంగంగా చెప్పలేకపోయారని, తాను చెప్పగలిగానని తెలిపారు. రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి, అమరావతిలో నాకు ఇది కనిపించలేదని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై విమర్శలు చేసేవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న ఆయన పార్టీ ఫిరాయింపులపై త్వరగా చర్యలు తీసుకునేలా చట్టం మారాలని అన్నారు. అసెంబ్లీలో వాడుతున్న బాష పై అందరూ బాధ్యత తీసుకోవాలన్న ఆయన ఈ సంప్రదాయాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలని అన్నారు. వ్యక్తిగత, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలన్న తమ్మినేని ఏదోఒక సమయంలో భావోద్వేగాలకు లోనుకావడం సహజమని అన్నారు.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju