AP Telangana Water War: పులివెందుల పులి బిడ్డ ఏంటి ఆలా తగ్గిపోయాడు..! కేసీఆర్ అంటే భయపడుతున్నట్లేనా..!?

Share

AP Telangana Water War: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల జగడం తీవ్ర రూపం దాలుస్తోంది. అటు ఇటు అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఏపి అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టుల్లో జలవిద్యుత్ ను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఏపి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. రాయలసీమ (పులిచింతల) పులిబిడ్డ అని అభిమానులు కీర్తించే వైఎస్ జగన్మోహనరెడ్డి ఏమిటి ఇలా మాట్లాడారు అని జనాలు విస్మయానికి గురైయ్యారు. జగన్ ఏమిటి అలా తగ్గిపోయారు ? ఆలా వ్యాఖ్యలు చేయడం ఏమిటని ? కేసిఆర్ కు భయపడుతున్నారా? భయపడుతున్నట్లు నటిస్తున్నారా?. అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

AP Telangana Water War ap cm ys jagan comments
AP Telangana Water War ap cm ys jagan comments

Read More: PV Sindhu: పీవీ సింధుకు రూ.5లక్షల చెక్కు అందజేసిన సీఎం వైఎస్ జగన్

ఏపి కేబినెట్ సమావేశంలో జల వివాదంపై చర్చించారు. తెలంగాణలో ఏపి ప్రజలు ఉన్నారని..వాళ్లని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఎక్కువగా మాట్లాడటం లేదని జగన్ అన్నారు. అలాగని ఏపి రైతులకు అన్యాయం జరగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోనేది లేదని తేల్చి చెప్పారుట. కృష్ణా జలాల విషయంలో ఏపి హక్కు కోసం జగన్ మాట్లాడితే, తెలంగాణను నిలదీస్తే అక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలకు వచ్చే నష్టం ఏమిటి ?. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రా ప్రాంత ప్రజలలో ఎక్కువ శాత మంది అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారు. ఆంధ్ర ప్రజలు ఎక్కవగా నివాసం ఉండే ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రజలకు ఎక్కడా నష్టం జరగలేదు. ప్రభుత్వానికి వీరు సహకరిస్తున్నారు. వీరికి ప్రభుత్వం సహకరిస్తున్నది. అక్కడి ఆంధ్ర ప్రజలను కేసిఆర్ ఇబ్బంది పెడితే ఎన్నికల్లో నష్టపోయిది టీఆర్ఎస్‌యే గానీ ఏపికి వచ్చే లాభనష్టం ఏమి ఉంటుంది. ఇక పోతే ఇటీవల కాలం వరకూ కేసిఆర్ కు భయపడి చంద్రబాబు పది సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ పారిపోయి వచ్చారంటూ వైసీపీ నేతలు విమర్శించారు. ఇప్పుడు గనక జగన్ తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టుల గురించి గట్టిగా మాట్లాడకపోతే కేసిఆర్ కు జగనూ భయపడ్డారని టీడీపీ వారు విమర్శించే అవకాశం ఏర్పడుతుంది.

AP Telangana Water War: జగన్ వ్యాఖ్యలు సాకు మాత్రమే..

జగన్ వ్యాఖ్యలను ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు డాక్టర్ తులసిరెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ ప్రాజెక్టలపై జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఏపి వాళ్లున్నారనీ, వాళ్లని ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతోనే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై తాను మాట్లాడటం లేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ జలదక్ష చేపట్టినప్పుడు ఏపి వాళ్లు తెలంగాణలో లేరా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఏపి వాళ్ల కోసం అనేది సాకు మాత్రమేనని తులసిరెడ్డి విమర్శించారు. తెలంగాణలో ఉన్న తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై సీఎం జగన్ మాట్లాడటం లేదని తులసిరెడ్డి ఆరోపించారు.


Share

Related posts

బ్రేకింగ్: సినిమా షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

arun kanna

విశాఖలో వింత రోగం…! భయంతో వణికిపోతున్న జనాలు… ఐదుగురు మృతి!

arun kanna

బ్రేకింగ్:జగన్ మరొక సంచలన నిర్ణయం – రాత్రికిరాత్రి ప్రకటన

somaraju sharma