YS Jagan: ఏపీ సీఎం జగన్ తిరుపతి- శ్రీకాళహస్తి పర్యటనలో ఉన్నారు. ముందుగా తిరుపతి రూరల్ మండలం పేరూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణమైన వకుళమాత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం వకుళమాతని మొట్టమొదటిగా సీఎం జగన్ దర్శించుకున్నారు.ఆ తర్వాత శ్రీకాళహస్తిలో సమీపంలో ఇనగలూరులో ఏర్పాటుచేసిన అపాచీ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగిస్తూ.. అపాచీ పరిశ్రమ ద్వారా నేరుగా పదివేల ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.
దాదాపు 800 కోట్ల రూపాయలతో నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి అని తెలిపారు. ఇదే అపాచీ గ్రూప్ సంస్థ 2006వ సంవత్సరం లోనే నాన్న గారి హయాంలో తడలో పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తడ లో… ఇదే కంపెనీలో దాదాపు 15 వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. అందులో కూడా దాదాపు 60 శాతం మంది మహిళలే ఉద్యోగస్తులు. ఇక ఇదే అపాచీ పరిశ్రమ పులివెందల లోనే రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. త్వరలో తొమ్మిది వేల మందికి ఉపాధి కల్పించేలా అక్కడ క్లస్టర్ ప్రణాళికలు వేస్తుంది.
కాగా ప్రస్తుతం ఇనగలూరులో శంకుస్థాపన చేసిన కంపెనీ వచ్చే సెప్టెంబర్ నుండి అందుబాటులోకి రానుంది. అయితే ఈ పరిశ్రమలో దాదాపు 80 శాతం మంది మహిళలేకే ఉపాధి లభించనుంది అని అక్కడ మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దాదాపు పదిహేను వేలమందికి నేరుగా ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అవసరం కావాల్సి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ చాలు అపాచీ పరిశ్రమ యాజమాన్యానికి సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…