Apatite: బరువు తగ్గే టైం లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉంది అంటే అది ఈ అర్ధ రాత్రి ఆకలి అని చెప్పవలిసి ఉంటుంది. పగలంతా ఆకలిని అదుపు చేసుకున్న ఈ సమయంలో ఆకలిని అదుపు చేసుకోవడం చాలా మందికి సమస్యగా ఉంటుంది. దాదాపు అన్ని రకాల పండ్లు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి అని చెప్పక తప్పదు. మరీ ఎక్కువ గా తినకుండా మాములుగా తినేందుకు ఇవి మంచి ఆప్షన్ గా ఉంటాయి .
అందుకే మీకు అందుబాటులో ఉండే పండ్లను స్నాక్స్ గా తీసుకోండి. ఇది తొందరగా కడుపు నింపడం తో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి . మఖానా డైట్ చేసే వారికి చక్కటి స్నాక్ గా పనిచేస్తాయి. ఇందులో క్యాలరీలు కూడా బాగా త క్కువగా ఉంటాయి. వీటిని నూనె లేకుండా ఉప్పు, కారం వేసి వేయించి పక్కన పెట్టుకుంటే ఎప్పుడు ఆకలి వేస్తె అప్పుడు తినవచ్చు . అయితే వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్ లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి.
మురమురాల చాలా రకాలుగా తిని ఆకలి తీర్చుకోవచ్చు . నెయ్యి వేసి అందులో పోపు పెట్టి ఉప్పు, కారం వేసి నిల్వ చేసుకోవచ్చు. ఇష్టముంటే పుట్నాలు, పల్లీలు వంటివి కూడా వేసుకోవచ్చు . లేదంటే ఉప్పు, కారం, నెయ్యి మాత్రం కలిపి తిని ఆకలి తీర్చుకోవచ్చు .
ఆరోగ్యకరమైన చిప్స్ తినాలని అనుకుంటే మాత్రం రాగి చిప్స్ ట్రై చేయండి. ఈ ఆరోగ్యవంతమైన చిప్స్ ని ఎలాంటి సంకోచం లేకుండా హాయిగా తినవచ్చు . అయితే చిప్స్ డీప్ ఫ్రై చేయకుండా బేక్ చేయడం లేదా రోస్ట్ చేయడం వల్ల మాత్రమే క్యాలరీలు పెరగకుండా ఉంటాయి అని గమనించాలి.