జగన్ తో అపోలో ఫ్యామిలీ భేటీ

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోమన్ రెడ్డిని అపోలో ఆస్పత్రి చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి.. ముఖ్యమంత్రి జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతాప్ సి రెడ్డి భార్య సుచరిత, ఆయన కుమార్తెలు ప్రీతరెడ్డి, సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్ నరోత్తం రెడ్డి, సీఈవో సత్యనారాయణ రెడ్డిలు జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.