Appendicitis: తరచుగా కడుపు నొప్పి వస్తుందా..!? ఆకలి వేయడం లేదా.. వికారంగా అనిపిస్తుందా..!? పొట్ట లో మరీ ముఖ్యంగా నాభి లో విపరీతమైన నొప్పి వస్తుందా..!? ఈ ఈ ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం అవును అయితే.. బహుశా మీరు అపెండిసైటిస్ ఈ సమస్యతో బాధపడుతున్నారేమో చెక్ చేసుకోండి..!!
Appendicitics: అపెండిసైటిస్ లక్షణాలు..!!
కడుపు లో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీని వలన ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అంటాము. దీనిలో మలినాలు చేరటం వలన గోడలు వాచిపోయి కడుపులో నొప్పి వస్తుంది. అపెండిక్స్ కేవలం 3 – 4 అంగుళాల పొడవు ఉంటుంది. పెద్ద పేగు లింక్ అయి చిన్న ట్యూబ్ తరహాలో ఉంటుంది. ఇందులో మలినాలు చెరకుడదు. ఒకవేళ చేరితే జటిలమవుతుంది. అపెండిసైటిస్ లక్షణాలు నాలుగు నుంచి 48 గంటల సమయం పట్టవచ్చు. అపెండిక్స్ సమస్యని 24 గంటల కడుపు నొప్పి అని కూడా అంటారు..
ఈ సమస్య ఏర్పడిన 24 గంటల లోపు ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్లో అపెండిక్స్ లో ఉన్న మలినాలను, మలం లో తొలగిస్తారు. దీనిలో మలినాలు మరింత ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు అపెండిక్స్ ను తొలగిస్తారు. ఈ సమస్య వచ్చినా వెంటనే చికిత్స చేసుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు ప్రాణాపాయం అవుతుంది. మనం తీసుకునే ఆహారం కారణం గా మన ఆహారపు అలవాట్లు కారణంగా ఈ సమస్య వస్తుంది. అధిక పీచు పదార్ధలు ఆహారంలో తీసుకునే వారిలో ఈ సమస్య తక్కువగా ఉంటుంది అని పలు అధ్యయనాల్లో తేలింది. అందువలన పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మన డైట్ లో భాగం చేసుకోవాలి.