NewsOrbit
టెక్నాలజీ న్యూస్

టిక్‌టాక్ బ్యాన్ అయితే.. సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు భారీగా న‌ష్టం..?

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో చైనాకు చెందిన యాప్‌లు టిక్‌టాక్‌, విచాట్‌ల‌ను నిషేధిస్తూ ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ రెండు సంస్థ‌ల‌ను ఎవ‌రైనా కొనుగోలు చేస్తే స‌రి.. లేదంటే వాటిని 45 రోజుల త‌రువాత నిషేధిస్తామ‌ని కూడా తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై కూడా సంత‌కం చేశారు. అయితే టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌, ట్విట్ట‌ర్‌లు ఆస‌క్తిగా ఉన్న‌ప్ప‌టికీ డీల్‌కు మ‌రీ త‌క్కువ స‌మ‌యం ఉండ‌డంతో అస‌లు ఆ డీల్ జ‌రుగుతుందా, లేదా.. అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. మ‌రోవైపు టిక్‌టాక్‌, విచాట్ లు గ‌న‌క బ్యాన్ అయితే అది సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఐఫోన్ల అమ్మ‌కాల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు.

apple iphone sales decline by 30 percent if tiktok and wechat gets banned

ప్ర‌ముఖ టెక్‌ విశ్లేష‌కుడు మింగ్‌-చి కువో టిక్‌టాక్‌, విచాట్‌ల బ్యాన్ నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ట్రంప్ ఆదేశించిన‌ట్లుగా 45 రోజుల్లోగా టిక్‌టాక్, వి చాట్‌ల కొనుగోలు ప్ర‌క్రియ పూర్తి కాక‌పోతే వాటిని నిషేధిస్తారు. అయితే అవి నిషేధానికి గురైతే యాపిల్ యాప్ స్టోర్ నుంచి వాటిని తీసేయాల్సి వ‌స్తుంది. దీంతో చైనా సాఫ్ట్‌వేర్ మార్కెట్‌పై అది ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తుంద‌ని.. కువో అన్నారు. ఈ నేప‌థ్యంలో చైనాలో యాపిల్ ఐఫోన్ల‌ అమ్మ‌కాలు 30 శాతం వ‌రకు ప‌డిపోతాయంటున్నారు.

చైనాలో విచాట్ యాప్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. అదే బ్యాన్ అయితే ఆ యాప్ యాప్ స్టోర్‌లో ఉండ‌దు క‌నుక‌.. ఐఫోన్ల‌ను వాడేవారి సంఖ్య త‌గ్గుతుంది. దీంతో ఆ ఫోన్ల అమ్మ‌కాలు కూడా త‌గ్గుతాయి. అదే జ‌రిగితే అక్క‌డ 30 శాతం ఐఫోన్ల అమ్మ‌కాలు ప‌డిపోతాయ‌ని.. కువో అంచ‌నా వేస్తున్నారు. అలాగే దానివ‌ల్ల ఇటు అమెరికా మార్కెట్‌లోనూ 6 శాతం ఐఫోన్ల అమ్మ‌కాలు ప‌డిపోతాయంటున్నారు. అందువ‌ల్ల ఈ రెండు యాప్‌ల నిషేధం ప్ర‌భావం యాపిల్ సంస్థ‌పై బాగానే ప‌డుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే మ‌రికొద్ది రోజులు ఆగితే ఈ రెండు యాప్‌ల భ‌విత‌వ్యం ఏమిటో తేలిపోతుంది.

author avatar
Srikanth A

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju