NewsOrbit
న్యూస్ సినిమా

అబ్బా మాస్‌రాజా పక్కన అప్సర రాణి .. ఆర్జీవీ అనుకున్నదే చేశాడు ..!

ప్రస్తుతం గోపీచంద్ మలినేని – మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ‘క్రాక్’. ఒంగోలులో జరిగిన ఒక యాదార్థ సంఘటన ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. శృతిహాసన్ ఈ సినిమాతో చాలాకాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ ఈ సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు.

Ravi Teja and Shruti Haasan's Krack Sankranti poster released | Telugu  Movie News - Times of India

లాక్ డౌన్ కారణంగా 7 నెలల తర్వాత ఇటీవలే హైదరాబాద్ లో ‘క్రాక్’ తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుతుంది. అయితే ఈ సినిమాలో ఒక ఐటం సాంగ్ ఉన్న విషయం మేకర్స్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు బాలీవుడ్ బ్యూటీని తీసుకు రాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలోని ఐటెమ్ సాంగ్ కోసం ఆర్జీవి ఓవర్ నైట్ స్టార్ ని చేసిన బ్యూటి తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నట్లు స్వయంగా చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సాంగ్ లో రవితేజ పక్కన ఆర్జీవి ద్వారా ఫేమస్ అయిన అప్సరా రాణి స్టెప్పులేస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కంపోజ్ చేసిన ఈ మాస్ ఐటెం సాంగ్ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సాంగ్ కి సంబంధించిన మేకింగ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక అప్సరా రాణి ఆర్జీవీ రూపొందించిన ‘థ్రిల్లర్’, ‘లెస్బియన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘క్రాక్’ లో ఐటెం సాంగ్ హిట్ అయితే అప్సర రాణి కెరీర్ పీక్స్ కి వెళ్ళడం ఖాయం అంటున్నారు. మొత్తానికి ఆర్జీవీ అప్సరా రాణి కి ప్రామిస్ చేసినట్టుగా స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టాడు. దాన్ని నిలుపుకునే బాధ్యత మాత్రం హాట్ బ్యూటీ అప్సరా రాణి దే. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ – సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri