NewsOrbit
న్యూస్ సినిమా

Aravind swamy: కమల్ హాసన్‌కి పోటీగా అరవింద స్వామి 6 గెటప్పులతో ప్రయోగం

Aravind swamy: లోక నాయకుడు కమల్ హాసన్ డ్యూయల్ రోల్, త్రిబుల్ యాక్షన్ కాదు ఏకంగా పది పాత్రలలో దశావతారం సినిమాలో నటించి విశ్వనటుడుగా పేరు సంపాదించారు. రెండు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం అంటేనే అంత సులభం కాని పని. అలాంటి ఏకంగా పది పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను మెప్పించారు. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాల, విశ్లేషకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. పది పాత్రలకి వేటికవే ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఈ పది పాత్రలలోను కమల్ జీవించారు. ఇక ఈ పది పాత్రలకి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం డబ్బింగ్ చెప్పడం మరో గొప్ప విషయం.

aravind-swamy-experiments with 6 getups
aravind swamy experiments with 6 getups

ఇప్పుడు పది పాత్రలతో కాకపోయినా ఆరు పాత్రలతో నటించి తన సత్తా ఏంటో చూపించడానికి అగ్ర కథానాయకుడు అరవింద స్వామి సిద్దమవుతున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు విలన్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తున్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధృవ సినిమాలో అరవింద స్వామీ నటన అద్భుతం. ఈ పాత్ర ఆయన తప్ప మరొకరు చేస్తే అనే ఊహకి కూడా అందని విధంగా నటించి ఆకట్టుకున్నారు. కాగా ప్రస్తుతం అరవింద స్వామి సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వనంగముడి’  సినిమాలో రకరకాల రూపాల్లో కనిపించబోతున్నారు.

Aravind swamy: దశావతారం లా ‘వనంగముడి’ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.

ఒకటి, రెండు కాదు ఏకంగా ఆరు రకాల విభిన్నమైన గెటప్ లలో కనిపిస్తాడట. ఇక ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ లలో మేకర్స్ ఆయన లుక్స్ ని వదిలి ఆసక్తిని రేపారు. ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సిమ్రాన్- రితికా సింగ్- నందిత శ్వేత- చాందిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒక పాత్ర కోసం అరవింద స్వామి ఎంతగా శ్రమిస్తారో అందరికీ తెలిసిందే. అయితే ‘వనంగముడి’ సినిమా కోసం మాత్రం ముందెన్నడూ లేని విధంగా కష్టపడుతున్నారని చిత్ర బృందం అంటోంది. చూడాలి మరి కమల్ దశావతారం లా ‘వనంగముడి’ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu