Ardha shathabdam: కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, కృష్ణప్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అర్ధశతాబ్దం.. కులాల బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు..

Read More: Lungs: ఊపిరితిత్తులకు ఊపిరిని అందించండిలా.. కరోనాను జయించండి..
ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాసులు ఉండేవి ఒకానొక రాక్షస సమయం లో మానవ జాతి పుట్టుక సంభవించింది అని శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. ఈ యాభై ఏళ్ల స్వాతంత్రం దేనికోసమో, ఎవరికోసమో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు.. అనే డైలాగ్ తో ముగించిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్.. ఈ చిత్రంలో సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేష్, రాజా రవీంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని వీర్ ధర్మిక్ సమర్థనలు చిట్టి కిరణ్ రామోజు నిర్మించారు. ఈ సినిమాకు నాఫల్ రాజా సంగీతం అందించారు. వాస్తవానికి ఈ సినిమ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది.. మొత్తానికి జూన్ 11న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది..