Pan Indian movies : బాహుబలి తర్వాత అన్నీ ఇండస్ట్రీలు పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిచేందుకు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగా కథ, కాస్టింగ్ భారీ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్నవాళ్ళనే అంటే హిందీ, తెలుగు లేదా హిందీ, తమిళం భాషలలో బాగా క్రేజ్ ఉన్నవాళ్ళని తీసుకుంటున్నారు. అంటే సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ ఉన్నవాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు పెద్దగా క్రేజ్ లేనివాళ్ళు హీరోయిన్స్ గా పాన్ ఇండియన్ సినిమాలలో నటించి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అయితే హీరోలకి వచ్చినంత క్రేజ్ అండ్ మార్కెట్ మాత్రం హీరోయిన్స్ కి రావడం లేదు.
సినిమా బ్లాక్ బస్టర్ అయి పాన్ ఇండియన్ స్థాయిలో హిట్ అందుకున్నా హీరోయిన్ గురించి మాత్రం ఏ ఒక్కరు మాట్లాడుకోవడం లేదు. అలాంటి హీరోయిన్ కేజీఎఫ్ 1 సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ 1 ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్, ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ సాధించారు. ఇప్పుడు దీని సీక్వెల్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 రాబోతోంది. ఇప్పటికే ఈ సీక్వెల్ టీజర్ తో మరో రెంజ్ క్రేజ్ తెచ్చుకున్నారు.
Pan Indian movies : ఈ ఏడాదిలో మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి.
ప్రస్తుతం డైరెక్టర్ కి టాలీవుడ్ లో ప్రభాస్, జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఆల్రెడీ సలార్ సినిమాను ప్రభాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. యష్ కోసం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. యష్ కూడా ఇటీవల ఓ పాన్ ఇండియన్ సినిమా ప్రకటించాడు. కానీ హీరోయిన్ కి మాత్రం ఆ రేంజ్ ఆఫర్స్ ఇప్పటి వరకు రాలేదు. శ్రీనిధి శెట్టి కి మాత్రమేనా లేక పాన్ ఇండియన్ సినిమాలలో నటించే మిగతా హీరోయిన్స్ కి ఇలాగే జరుగుతుందా అని ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. చూడాలి మరి ఈ ఏడాదిలో మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలు రానున్నాయి. వాటిలో ఈ విషయంలో ఓ క్లారిటీ రానుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!