NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: రెండు కాంగ్రెస్ కత్తులు ఒకే ఒరలో ఇమిడాయా?తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఆ ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే?

telangana congress next target is 79 seats

Telangana Congress: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదనేది పాత నానుడి.తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీన్ని మరోసారి రుజువు చేశారు.

What was that interesting incident that became a hot topic in the Telangana Congress?
What was that interesting incident that became a hot topic in the Telangana Congress

హైదరాబాద్ లో శనివారం జరిగిన ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకు తిరిగారు.దీంతో ఆ పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. ప్రజలు అవాక్కయ్యారు.అందర్నీ బకరాలు చేసిన ఈ ఉదంతం పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

Telangana Congress: ఫ్లాష్ బ్యాక్ పరిణామాలేమిటంటే!

ఇటు రేవంత్ రెడ్డి, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ ఎంపీలే! ఉత్తమ్ కుమార్ రాజీనామాతో ఖాళీ అయిన టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవికి వీరిద్దరూ పోటీ పడ్డారు.నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నాయకుడు.నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టు.రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు.కాలం కలిసొచ్చి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచారు.అయినా కాంగ్రెస్ లో లాబీయింగ్ వర్కౌట్ అయి తెలంగాణ పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డి కి దక్కాయి.దీంతో కోమటిరెడ్డి కి విపరీతమైన కోపం వచ్చింది.మీడియా సమావేశంలోనే ఆయన రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ మాణిక్యం ఠాకూర్ కు కోట్లాది రూపాయలు ముడుపులిచ్చి రేవంత్ రెడ్డి ఆ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. టీపీసీసీ తెలుగుదేశం పార్టీ లాగ తయారైందని దుమ్మెత్తిపోశారు.తానిక గాంధీ భవన్ లో అడుగుపెట్టనని కూడా వెంకటరెడ్డి శపథం చేయటం తెలిసిందే.మన హుజూరాబాద్ ఎలక్షన్ లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయాక కూడా వెంకటరెడ్డి తనదైన శైలిలో రేవంత్ రెడ్డి మీద అనేక విమర్శనాస్త్రాలు సంధించారు.దీంతో వీరిద్దరూ ఉప్పు నిప్పు అని అందరూ భావించారు.

ఆ ఇద్దర్నీ దరిచేర్చిన ధర్నాచౌక్!

అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం విస్తుపోయే సంఘటనకు ధర్నాచౌక్ నేడు వేదికైంది.వరి దీక్ష పేరుతో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుగానే అక్కడికి చేరుకొని పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.ఆ కాసేపటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అక్కడకు వచ్చారు.ఆయనకు రేవంత్ రెడ్డి స్వాగతం పలికి వేదికపైకి ఆహ్వానించారు.అంతేగాక పక్కపక్కనే కూర్చొని కబుర్లలో మునిగిపోయారు.తమ మధ్య అసలేం జరగలేదన్నంత ఇదిగా వారు ఆప్యాయంగా మాట్లాడుకోవటం చూసి అక్కడ ఉన్న అందరికీ మతిపోయింది.ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్.

 

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?