The Elderly: మీ ఇంట్లో  వృద్ధులు  ఉన్నారా ? అయితే వారి ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి!!

Share

The Elderly: వయస్సు పెరిగే కొద్దీ పెద్ద వాళ్ళు  చిన్న పిల్లలు అయిపోతుంటారు.  పెద్ద వయసు  వారు ఇప్పటికే  ఎంతో అనుభవం ఉండి కూడా   చిన్న పిల్లల్లానే  ప్రవర్తిస్తుంటారు. ఆ వయస్సులో వారి మైండ్ సెట్ అలానే ఉంటుంది.అది మనం అర్థం చేసుకోవాలి.  ఇంట్లో పెద్ద వయసు వారు ఉంటే, వారిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది కాస్త  ఓర్పుతో కూడుకున్న పని. చంటి  పిల్లలను  ఎంత ఓపికగా సాకుతామో,   పెద్దలను   కూడా  అంతకంటే ఎక్కువ ఓపికతో  చూసుకుంటే వారి ఆఖరు సమయం ఆనందంగా గడుస్తుంది.   వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు  తీసుకుంటే చాలు వాటి గురించి తెలుసుకుందాం …

The Elderly: పెద్ద వారి సలహా తీసుకోండి..

ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద వారిని సలహా  అడగండి.  వారు ఇచ్చిన సలహా ప్రకారం   చేయడంలో  ఇబ్బంది ఉంటే  వారికి  ఆ విషయాన్ని వివరించి చెప్పండి.  ఎందుకంటే, మనల్ని పెంచి  పెద్ద చేసిన  క్రమంలో ఇటువంటి ఎన్నో  సమస్యలను  ఎదుర్కొని ఉంటారు కదా..   మీరు సలహా  అడగడం వలన  మీరు వారికి  ఇస్తున్న  గౌరవాన్ని చూసుకుని   ఎక్కువ మురిసిపోతారు. వారి మురిపెం వారిని   ఆరోగ్యంగా  ఉండేలా చేస్తుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం వారి శారీరకం గా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

The Elderly: ముఖ్యమైన ఫోన్ నంబర్స్

మీకు   అన్ని సమయాలలో    ఇంట్లో ఉండటం సాధ్యం కాదు . మీరు లేని సమయంలో పెద్దవాళ్లకు ఏదైనా  ఆరోగ్య సమస్యలు వస్తే  ఏ డాక్టర్ కు ఫోన్  చేయాలి అనేది  ఇంట్లో అందరికీ తెలిసి ఉండాలి. అదేవిధంగా  అత్యవసర సమయం లో ఉపయోగపడతాయి అనుకున్న  అన్ని నెంబర్లు రాసుకుని    అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎపుడైనా అత్యవసరం  అనుకున్నప్పుడు ఆ నెంబర్లు ఉపయోగపడతాయి.
మీ సహాయం అందించండి పెద్దవారికి ఇంట్లో ఒంటరిగా ఉన్నామనే భావన   రాకుండా చూసుకోండి.  వారు చేయగలిగే  చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం  గడిపేస్తారు. వారి పనుల్లో సహాయం కావాలా అని  ఎప్పుడు అడుగుతూ ఉండండి.  ఎందుకంటే, మీరు అలా అడిగితే  వారంటే మీకు  చాలా శ్రద్ధ అన్న       విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులు ఉత్సాహంగా ఉంటాయి.

చురుగ్గా  ఉండేలా చేయండి

శారీరక వ్యాయామం చేయటం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి.   ఇది ఆందోళన మరియు నిరాశ ను  పోగొట్టి ఉత్సాహాన్ని ఇస్తుంది.  మంచి హార్మోన్లను   విడుదల చేస్తుంది. తోటపని చేయడానికి, కలిసి  వాకింగ్ చేయడానికి , పెంపుడు జంతువుల సంరక్షణ చేసేలా  ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది.

ఈ మాట ఎప్పుడు గుర్తు పెట్టుకోండి

పెద్దవారు తమని పిల్లలు పట్టించుకోవడం లేదు అనే భ్రమలో వెళ్లిపోతుంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది అని గుర్తు పెట్టుకోండి.  మన తీరిక లేని జీవితం లో సాధారణంగా పెద్దలు గురించి పట్టించుకోము. అన్నీ  అమర్చి పెడుతున్నాం  కదా అనుకుంటాం. కానీ,  వారికి   కావలసింది మాత్రం   మీ నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలు.   అందుకే ఎంత బిజీగా ఉన్నా కూడా , రోజులో ఒక్కసారైనా   పెద్దవారితో   కొద్ది సేపు మాట్లాడండి.  అది వారి పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు చేసి హుషారుగా ఉంచుతుంది.  వారిని విసుక్కోవడం,తిట్టడం వంటివి పొరపాటున కూడా చేయకండి. ఆ వయస్సులో శరీరానికి నొప్పులు ఉంటాయి వారు అస్తమానం చెబుతుంటారు విసుక్కోకుండా వాటిని విని తగ్గిపోతుంది అని  ఓదారుస్తూ..  మీరే స్వయంగా మందు రాయండి. వారికి అంతకన్నా మనం ఇవ్వగలిగినది ఏమి లేదు.


Share

Related posts

లాస్య పప్పును వదలదా ఇక? తన భర్త బలైపోయాడుగా?

Varun G

Nithin : నితిన్ సినిమా పట్టాలెక్కకుండా ఆగిపోయిందా..?

GRK

అయ్య బాబోయ్ 27 అయస్కాంతాలను మింగేసిన నాలుగేళ్ల బాలుడు.. చివరికి?

Teja