Nani: నాని సినిమాలు వరుసగా ఫ్లాపవడానికి కారణాలు ఇవేనా.?

Share

Nani: నేచురల్ స్టార్‌గా టాలీవుడ్‌లో నానికి యంగ్ హీరోలలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దర్శకుడవ్వాలనుకున్న నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ అవకాశం ఇవ్వడంతో హీరోగా మారాడు. అష్టా చమ్మ సినిమాతో హీరోగా మారిన నాని పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. నానికి నేచురల్ స్టార్ అనే ఇమేజ్ కూడా వచ్చింది. నానితో సినిమాలు చేస్తే నిర్మాతలు సేఫ్ అని ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకున్నాడు. మీడ్యం బడ్జెట్ సినిమాలకి, ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌ గా మారాడు నాని.

are these the reason for nani movies flop
are these the reason for nani movies flop

ఆ ఇమేజ్‌తో ఏ టాలీవుడ్ హీరోలు చేయనంత వేగంగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నానికి హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఉండటం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఎలాంటి కథలో అయినా నాని పర్‌ఫెక్ట్‌గా సూటవుతున్నాడు. సహజమైన నటనతో నాని అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే గత కొంతకాలంగా వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు గాని, హిట్స్ మాత్రం దక్కడం లేదు. చేసిన ప్రతీ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు.

Nani: నిర్మాతలకి కాస్త నష్టాలని మిగిల్చాయని చెప్పుకున్నారు.

నాని హిట్ అందుకున్న చివరి సినిమా నిన్నుకోరి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నివేత థామస్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా మెదట్లో కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఆ తర్వాత మాత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి నానీకి సక్సెస్‌లు దక్కడం లేదు. నిన్నుకోరి సినిమా తర్వాత ఎం.సి.ఎ, కృష్ణార్జున యుద్దం, దేవదాస్, నానీస్ గ్యాంగ్ లీడర్, వి సినిమాలు చేశాడు.

కానీ ఈ సినిమాలన్నీ నానికి హిట్ ఇవ్వలేకపోయాయి. ఎం.సి.ఎ ఒకమాదిరి హిట్ అందుకుంది. సాయి పల్లవి – నాని పర్ఫార్మెన్స్ సినిమాకి ప్లస్ పాయింట్ కావడంతో సినిమా భారీ హిట్ కాకపోయినా నిర్మాతకి మాత్రం మంచి లాభాలను తీసుకువచ్చింది. కానీ కృష్ణార్జున యుద్దం, దేవదాస్, నానీస్ గ్యాంగ్ లీడర్, వి సినిమాలు మాత్రం నిర్మాతలకి కాస్త నష్టాలని మిగిల్చాయని చెప్పుకున్నారు. గత చిత్రం వి మల్టీస్టారర్ గా రూపొందింది. నానికి ఇంతకముందు హిట్స్ ఇచ్చిన ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మాత.

Nani: నాని నెత్తినేసుకొని ఫ్లాపులను మూటగట్టుకున్నాడని అంటున్నారు.

కానీ కరోనా వేవ్ కారణంగా థియోటర్స్ మూతపడి ఉండటంతో ఓటీటీలో రిలీజ్ చేశారు. నిర్మాత దిల్ రాజుకి 10 కోట్లు లాభాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని మళ్లీ వార్తలు వచ్చాయి. ఇలా నానికి హిట్స్ రాకపోవడానికి కారణం ఆయన కథల మీద దృష్టి పెట్టకపోవడమేనని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ ఉంది. ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో ఏది పడితే ఆ కథ ఒప్పుకోవడం వల్లే ఫ్లాపులను మూటకట్టుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. వేరే హీరోలు కథ నచ్చక రిజెక్ట్ చేసినవై కూడా నాని నెత్తినేసుకొని ఫ్లాపులను మూటగట్టుకున్నాడని అంటున్నారు.

మరి ఇప్పటికైనా అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా తనకి సూటైన కథలను ఎంచుకుంటే బావుంటుందని సలహాలిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన టక్ జగదీష్,శ్యాం సింగ రాయ్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అంటే..సుందరానికి అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కానుంది. మొత్తం 3 సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్న నానీ ఈ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటే మాత్రం మళ్ళీ తన రేంజ్ పెరిగిపోతుంది. లేదంటే ఇక కెరీర్ కాస్త కష్టమే.


Share

Related posts

Rangasthalam : రంగస్థలం తమిళంలో హిట్ అవుతుందా..?

GRK

‘కన్నా’ ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా – ఉద్రిక్తత

somaraju sharma

Pooja hegde : పూజా హెగ్డే కి టాలీవుడ్, బాలీవుడ్ ఇవ్వని రెమ్యూనరేషన్ కోలీవుడ్ ఎలా ఇస్తుంది..?

GRK