Tollywood: సోషల్ మీడియాను వదిలేస్తున్న టాలీవుడ్ స్టార్స్ ..అందుకు కారణం వారేనా..?

Share

Tollywood: టాలీవుడ్ మాత్రమే కాదు..బాలీవుడ్, కోలీవుడ్ సహా మిగతా సౌత్ సినీ తారలందరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఇన్స్టాగ్రాం లాంటివి వచ్చాక దాదాపు అందరు సినీ తారలు ఇక్కడే తమ సినిమాలకు సంబంధించిన అలాగే పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. అంతకముందు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఇలా ఏదైనా చిన్న ఈవెంట్ పెట్టి రిలీజ్ చేసే వారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అన్నీ అప్‌డేట్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి.

ముఖ్యంగా ట్విట్టర్ వేదికగానే చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు ఆయా చిత్రాల మేకర్స్, హీరో హీరోయిన్స్ అన్నీ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ తారలందరికీ అలాగే దర్శక నిర్మాతలకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ తమ లేటెస్ట్ ఫొటో షూట్స్‌ను ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ బాగా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా అనేది మంచి మార్గం అయిపోయింది.

Tollywood: హీరోలను ట్వీట్స్‌తో ఇబ్బందులు పెడుతున్నారు.

అయితే ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు ప్రభావం కూడా ఉంటుందని పెద్దలు చెప్పినట్టుగానే సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు, లాభాలున్నాయో..అంతకు మించి తీవ్ర స్థాయిలో నష్టాలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కొందరు యాంటీ ఫ్యాన్స్ కొందరు హీరో, హీరోయిన్స్‌ను నిర్మాతలను డైరెక్ట్‌గా టార్గెట్ చేసి ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. దీనివల్ల ఫ్యాన్స్ – యాంటీ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక కొన్ని సినిమాలకు సంబంధించిన నెగిటివ్ రివ్యూస్ కూడా సోషల్ మీడియాలలోనే పోస్ట్ చేసి ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.

are these tollywood stars leaving social media..?
are these tollywood stars leaving social media..?

అలాగే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వమని మేకర్స్‌ను హీరోలను ట్వీట్స్‌తో ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి వ్యవహారలన్నీ సోషల్ మీడియాలో జరుగుతూ కొందరికి బాగా విసుగు తెప్పిస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్లే ఇంతకముందు దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియాను వదిలేస్తున్నట్టు ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇక ఇటీవల నాగ చైతన్యతో విడాకులయ్యాక సమంతను ట్విట్టర్ వేదికగా ఎంత దారుణంగా కొందరు వేధించారో తెలిసిందే. ఆమెనే టార్గెట్ చేస్తు పలు రకాల కామెంట్స్ చేసి ఇబ్బంది పెట్టారు. దాంతో సమంత సోషల్ మీడియా అకౌంట్స్ వాడకుండా దూరమయింది. ఇప్పుడు ఒక్క ఇన్స్టాగ్రాం లోనే తను యాక్టివ్‌గా ఉంటోంది.

Tollywood: సినీ తారలను విసిగిస్తుండటంతోనే వారు సోషల్ మీడియాను వదిలి పెడుతున్నట్టు అర్థమవుతోంది.

తాజాగా అల్లు అరవింద్ చిన్న కొడుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ట్విట్టర్ ఖాతాను వీడనున్నట్టు ప్రకటించాడు. కొన్ని కారణాల వల్ల తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. ఇలా శిరీష్ ప్రకటించాడో లేదో అలా తనను పెళ్ళి చేసుకోబోతున్నారా అని అడగటం మొదలుపెట్టారు. ఇలాంటి వ్యక్తిగత విషయాలలో చాలామంది నెటిజన్స్ దూరి సినీ తారలను విసిగిస్తుండటంతోనే వారు సోషల్ మీడియాను వదిలి పెడుతున్నట్టు అర్థమవుతోంది. మరి రానున్న రోజుల్లో ఇకెంతమంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాను వదిలేస్తారో చూడాలి.


Share

Related posts

మెగా హీరోలతో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ…??

sekhar

సుశాంత్ సింగ్ కేసు: ఈ విషయం తెలిస్తే రియా పై కోపం ఇంకా పెరుగుతుంది..!!

sekhar

Jr Ntr: హిట్టవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అయిందంటున్న పరుచూరి

Muraliak