Adipurush : ఆదిపురుష్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా. ప్రభాస్ నటిస్తున్న మొదటి హిందీ స్ట్రైట్ సినిమా కావడం విశేషం. మొదటి షెడ్యూల్ ముంబైలోని ప్రత్యేకంగా వేసిన గ్రీన్ మ్యాట్ సెట్ లో జరిగింది. అక్కడ ప్రభాస్, కృతి సనన్ ల మీద కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని రామోజి ఫిల్మ్ సిటీలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. అందుకే యూనిట్ హైదరాబాద్ చేరుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇక్కడ షూటింగ్ జరగలేదు.
కాగా తిరిగి మళ్ళీ ఆదిపురుష్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభంకు ఏర్పాట్లు చేస్తున్నారట. హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా లో సీత పాత్రలో ప్రభాస్ సరసన నటిస్తున్న హీరోయిన్ కృతి సనన్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కృతి సనన్ పాత్ర చాలా ప్రతీ ఒక్కరు మెస్మరైజ్ అయ్యేలా ఉంటుందట. సీత పాత్రని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా దర్శకుడు ఓమ్ రౌత్ అద్భుతంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
Adipurush : ఆదిపురుష్ లో మాత్రం సీత పాత్ర గురించి చెప్పబోతున్న విషయాలు చాలా కీలకం..
హీరోను ఎంత హైలెట్ గా ఇంట్రోలో చూపిస్తారో ఆ రేంజ్ ఇంట్రోలో సీత పాత్రలో కృతి సనన్ ని చూపించనున్నారట. సీత గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. అయితే ఆదిపురుష్ లో మాత్రం సీత పాత్ర గురించి చెప్పబోతున్న విషయాలు చాలా చూపించబోతున్నట్టు సమాచారం. ప్రభాస్ రాముడిగా, లంకేషుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఆగస్టు 11న ఇంటర్నేషనల్ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా ప్రభాస్ సలార్ తో పాటు వైజయంతీ మూవీస్ నిర్మించే 50వ సినిమా చేయనున్నాడు.