AP Legislative Council: ఆ రెండు పోస్టులు ఆ ఇద్దరికేనా?దాదాపు ఫిక్స్ అంటున్న వైసీపీ వర్గాలు!!

Share

AP Legislative Council: ఏపీ శాసనమండలి చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.శనివారం నాడు అధికార వైసిపిలో ఇదే విషయమై మంతనాలు సాగాయి.ఇప్పటి వరకు శాసనమండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పదవీకాలం పూర్తి అయింది.అలాగే డిప్యూటీ చైర్మన్గా ఉన్న రెడ్డి సత్యనారాయణ టర్మ్ కూడా మరో పదిహేను రోజుల్లో పూర్తికానున్నది.వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే.అయితే ప్రస్తుతం శాసనసభలో వైసీపీకి ఉన్న బంపర్ మెజారిటీ కారణంగా శాసనమండలిలో కూడా ఆ పార్టీ త్వరలోనే మెజార్టీ సాధించబోతోంది.ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక మీద వైసీపీ అధిష్టానవర్గం కూడా దృష్టి సారించింది.

Are those two posts for those two?
Are those two posts for those two?

ఇక్బాల్ ,జంగాలకు ఛాన్స్!

పదవీ విరమణ చేస్తున్న షరీఫ్ ,రెడ్డి సుబ్రమణ్యం ల సామాజిక వర్గాలకే వైసీపీ కూడా శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ ప్రకారం చూస్తే మహ్మద్ ఇక్బాల్(మైనారిటీ ), జంగా కృష్ణమూర్తి (బి.సి)లకు ఆ పదవులు దక్కే అవకాశం మెండుగా ఉంది.ఈ ఇద్దరూ కూడా పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు.ముఖ్యమంత్రి గీచిన గీతను వారు దాటే ప్రసక్తే ఉండదు. ఇలాంటి నమ్మకస్తులే శాసనమండలిలో ఆ కీలక పదవుల్లో ఉండాల్సిన అవసరం ఉందని వైసీపీ భావిస్తోంది. పైగా పదవీ విరమణ చేస్తున్న వారి సామాజిక వర్గాలకు చెందిన వారికే ఈ పదవులు ఇవ్వడం రాజకీయంగా కూడా కలిసి వస్తుందని వైసీపీ అంచనా.

Read More: Anandaiah medicine: ఆనందయ్య మందుపై వందల కోట్ల వ్యాపారం..! ఇది ఇంకేం ఉచితం?

AP Legislative Council: వీరిద్దరూ ఎవరంటే !

మహ్మద్ ఇక్బాల్ పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైసీపీ నుండి పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు.మైనార్టీ కోటాలో ఆయనకు వెంటనే జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.ఈ మధ్యే ఆయన పదవీకాలం పూర్తి కాగా మళ్లీ ఎక్స్ టెన్షన్ కూడా ప్రసాదించారు.ఇక జంగా కృష్ణమూర్తి గురజాలలో 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.అయితే ఆయనకు వెంటనే జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆదరించారు.బీసీ నేతగా ఆయనకు పార్టీలో మంచి ప్రాధాన్యం ఉంది.వారి అర్హతలన్నీ పక్కనబెడితే జగన్ కి మహా గట్టి నమ్మకస్తులు.శాసనమండలిలో నారా లోకేష్ వంటివారిని డీల్ చెయ్యాలంటే లాంటి వారిని చైర్మన్,డిప్యూటీ చైర్మన్ లుగా చేయడం అవసరమన్నది వైసీపీ వర్గాల భావన.ఇప్పటివరకు ఉన్న అప్ డేట్ ప్రకారమయితే వీరిద్దరికే ఈ రెండు కీలక పదవులు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వైసీపీ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.

 


Share

Related posts

స్టార్టింగ్ లోనే పార్టీ క్యాడర్ ను డైలమాలో పడేస్తున్న చంద్రబాబు, అచ్చెన్నా వ్యాఖ్యలు..!!

sekhar

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కు కరోనా పాజిటివ్ నిర్ధారణ

somaraju sharma

Sudigali Sudheer : అక్కడ కూడా సుధీర్ ను వదలరా? యాంకర్ సుమ, శేఖర్ మాస్టర్ మీరు మామూలోళ్లు కాదు?

Varun G