Sleep: నిద్రని అశ్రద్ధ చేస్తున్నారా ?  ఇది తెలుసుకున్నా తర్వాత ఏమి చేస్తారో మీ ఇష్టం!!

Share

Sleep: మీరు మీజాబ్ కి  ఎంత  విలువిస్తున్నారో
ఇప్పుడున్న బిజీ  జీవితంలో మనుషులు తమ ఆరోగ్యాన్ని ( Health )  నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎక్కువ వర్క్ చేయడం,  ఎక్కువ డబ్బు కోసం ఓటీలు చేయడం వంటివాటిపై శ్రద్ధ పెట్టి  టైమ్ కు తినకుండా అనారోగ్యల పాలవుతున్నారు అని  తాజా  పరిశోదనలో తెలింది.   సరిపడినంత  నిద్రపోకపోతే   అది  ప్రాణాలకేముప్పు అని  అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మీరు మీజాబ్ కి  ఎంత  విలువిస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ  విలువను నిద్రకు ఇచ్చినప్పుడే మీ జీవితం సక్రమం గా ఉంటుంది అని  మరువకండి.   ఇకనైనా స్మార్ట్ ఫోన్ల ను దూరం గా పెట్టి.. నిద్రను ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు.    నిద్రలేమి వల్ల కలిగే సమస్యలను తెలియచేస్తున్నారు.

Sleep:   అలసట వలన కంటి చూపు తగ్గడం తో పాటు

ఓ అధ్యయనం   నిద్రలేమి వల్ల ఆకలి  పెరిగి విపరీతం గా తినడం వలన అధిక బరువు  పెరుగుతారు అని తెలియచేస్తుంది.   బిట్రన్‌‌లో చేసిన  ఓ అధ్యయనంలో రాత్రి పూట పనిచేసే ఉద్యోగుల్లో ఊబకాయం, షుగర్ వంటి సమస్యలు  వస్తున్నట్టు తెలుస్తుంది.ప్రతీరోజు కచ్చితం గా 8 గంటలు నిద్రపోవాలని అప్పుడే మనిషి ఆరోగ్యం బాగుంటుంది అని తెలియచేస్తున్నారు. నాలుగు గంటలు మాత్రమే  నిద్రపోయే వ్యక్తి ఉదయాన్నే జంక్ ఫుడ్ తినేందుకు బాగా ఇష్టపడుతున్నారని తెలియచేసారు. దానికి కారణం  ముక్కులోని ఘ్రణ గ్రాహాకాల కారణంగా వారి మనసు వాటిపై ఎక్కువగా లాగుతుంది అని వివరించారు. అలసట వలన కంటి చూపు తగ్గడం తో పాటు   రక్తంలో ఆక్సిజన్ మోతాదు తగ్గి  కంటి రక్తనాళాలు చిట్లిపోతున్నాయని పరిశోధనలోబయట పడింది..

రాత్రివేళలో మెదడు విశ్రాంతి

నిద్ర వలన శరీరానికి ,మెదడుకు  విశ్రాంతి కలుగుతుంది.   రోజంతా  పని చేసాక రెస్ట్ లేకపోతే     శరీరం యొక్క పరిస్థితి  ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు.   ఇక ఎంతో సున్నితంగా ఉండే బ్రెయిన్ మీద ఈఅలసట ప్రభావం రెండింతలు ఎక్కువ పడుతుంది. కారణం ఏమిటంటే  శరీరంలోని అన్ని పనులు  సవ్యం గా  జరిగేలా మానిటర్ చేసేది మెదడే.  కాబట్టి రాత్రివేళలో మెదడు విశ్రాంతి తీసుకోవడం తో పాటు..మెదడులో ఉండే వ్యర్థాలను కూడా  బయటకు పంపుతుంది.  ఈ కారణం తో  10 గంటల కన్నా ఎక్కువ  నిద్రపోతే మాత్రం మెదడులో మరో రకమైన సమస్య వచ్చి  జ్ఞాపకశక్తి  కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి సరిపడా నిద్ర పోవడం అనేది అన్నివిధాలా మంచిది అని గుర్తుపెట్టుకోవాలి.


Share

Related posts

AP CID : వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకి సీఐడీ నోటీసులు

somaraju sharma

కరోనా కష్టం: పెరిగిన ఈపీఎఫ్ విత్ డ్రా.. ఎంతో తెలిస్తే షాకే..!

Muraliak

పవన్ కళ్యాణ్ పై ఊహించని కామెంట్లు చేసిన వైసీపీ మంత్రి..!!

sekhar