NewsOrbit
న్యూస్

రాజధానిపై హైకోర్టులో ముగిసిన వాదనలు..! నవంబర్2కి విచారణ వాయిదా..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రాజధాని అమరావతికి సంబంధించిన పలు పిటిషన్‌లపై ఏపి హైకోర్టులో సోమవారం వాదనలు ముగిసాయి. అనుబంధ పిటిషన్‌లపై ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి ఇరపక్షాలు ధర్మసనానికి వాదనలు వినిపించారు.

విశాఖ గెస్ట్ హౌస్ వివరాలను కౌంటర్‌లో దాఖలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గుప్తా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. విశాఖలో గెస్ట్ హౌస్‌ను రాజధానిలో భాగంగా నిర్మిస్తున్నారా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తూ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో గెస్ట్ హౌస్ ల కు సంబందించి పూర్తి వివరాలు అఫిడవిట్ లో పేర్కొనలేదనీ, విశాఖలో ఎంత విస్తీర్ణంలో, ఎన్ని గదులు నిర్మిస్తారన్నది స్పష్టం చేయలేదని అన్నారు. ప్రభుత్వ నిర్మాణాలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవనీ, ప్రభుత్వం నిర్మించబోయే గెస్ట్ హౌస్ లు చాలా విశాలమైన ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్నారనీ, దాని వల్లే అనుమానాలు వస్తున్నాయని అన్నారు. తాత్కాలికంగా సీఎం క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు.

దీనిపై ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సమాధానం ఇస్తూ రాజధానిలో భాగంగా విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం చపట్టడం లేదని ధర్మాసనానికి తెలియజేశారు. కాకినాడ, తిరుపతి, విశాఖలో అద్దెలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందన్న కారణంగానే గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపట్టామని అన్నారు. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణ అంశంపై తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం రాజధాని సంబంధిత ప్రధాన పిటిషన్లపై నవంబర్ 2వ తేదీ నుండి రోజు వారీ విచారణ చేపడతామనీ, అవసరమైతే శని, ఆదివారాల్లో కూడా వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.

author avatar
Special Bureau

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju