Content : Ariyana : అరియానా Ariyana గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అరియానా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మామూలు స్థాయి నుంచి సెలబ్రిటీ స్థాయికి వెళ్లిన అరియానా.. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందనే చెప్పుకోవాలి.

బిగ్ బాస్ కంటే ముందు యూట్యూబ్ చానెళ్లలో అరియానా ఇంటర్వ్యూలు చేసేది కానీ.. ఎప్పుడైతే ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసిందో తన ఫేటే మారిపోయింది.
ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం, తర్వాత బిగ్ బాస్ లో అవకాశం రావడం.. వెంటనే ఫేమ్ రావడం.. అబ్బో అరియానా గ్లోరీ ఫేటే మారిపోయింది.
Ariyana : A1 ఎక్స్ ప్రెస్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో అరియానా
అరియానాకు ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం కోసం ఏం చేసింది. ఎలా తయారైంది. డ్యాన్స్ ఎలా నేర్చుకుంది. అక్కడికి వెళ్లి ఎలా డ్యాన్స్ చేసింది.. అనే దానిపై ఓ వీడియోను రూపొందించింది అరియానా.
నిజానికి.. బిగ్ బాస్ తర్వాత అరియానా తన యూట్యూబ్ చానెల్ లో ఫుల్ బిజీ అయిపోయింది. తనకు వేరే చానెళ్లలో, షోలలో ఆఫర్స్ వచ్చినా.. అరియానా ఎక్కువగా తన యూట్యూబ్ చానెల్ తో బిజీ అయిపోయింది. ఎక్కువ వీడియోలు చేస్తూ.. తన అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటోంది.
తాజాగా తను అప్ లోడ్ చేసిన వీడియోను మీరు కూడా చూసేయండి.