ట్రెండింగ్ న్యూస్ సినిమా

బిగ్ బాస్ ముందు ఇది అరియానా అసలు స్వరూపం..! బీర్లు, సిగరెట్లు, బైక్ రైడింగ్ లు

Share

యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అనూహ్య రీతిలో పాపులర్ అయిపోయిన అరియానా గ్లోరీ బిగ్బాస్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె దశ తీరిపోయింది. చక్కటి పోరాటపటిమ తో మంచి ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇలాంటి పరిస్థితుల్లో బీరు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ బయట రచ్చ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

యాంకర్ గా కెరీర్ మొదలెట్టిన అరియానా రాంగోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ తో ఫేమస్ అయ్యింది. బిగ్బాస్ చెప్పినట్లు చేసే అరియానా టాస్కుల్లో ఆమె గెలవడం కోసం ఎంత దూరమైనా వెళుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఇంటిలోకి వచ్చినా అరియానా ఊహించని విధంగా ఫైనలిస్టు అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూ లతో బిజీగా గడుపుతోంది.

ఇలాంటి సమయంలో అనేక ఆఫర్లు కూడా ఆమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఈ బోల్డ్ బ్యూటీ కి సంబంధించిన ఒక హాట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఎప్పుడో అరియానా …. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో చేసినట్లు సిగరెట్లు కాలుస్తూ, బీరు తాగుతూ బైక్ నడుపుతూ ఒక వీడియో చేసింది. అయితే ఎన్నో రోజుల ముందు చేసిన ఈ వీడియోలో ఆమెకు గుర్తింపు రాలేదు.

కానీ తాజాగా దాన్ని ఇంస్టాగ్రామ్ లో కొందరు పోస్ట్ చేశారు. ఇప్పుడు వీడియో కి విశేష స్పందన వస్తుంది. లైకులు కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి.


Share

Related posts

Energy Food: ఈ లడ్డు ఒకటి తినండి చాలు.. వైద్యుడి దగ్గరకు వెళ్ళనవసరం లేదు..!!

bharani jella

ఏపీ లో కరోనా విజృంభణ 24 గంటల్లో 62 కేసులు

Siva Prasad

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar