Ariyanaa: గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మగవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది అరియనా. గేమ్ పరంగా.. ఇంకా పాయింట్ టు పాయింట్ మాట్లాడటంలో అరియనా.. ప్రేక్షకుల వద్ద మంచి అభిమానం సంపాదించింది. కానీ ఎప్పుడైతే హౌస్ లో కెప్టెన్ అయిందో.. ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు.. ఒక్కసారిగా టాప్ లో ఉన్న గ్రాఫ్ కిందకి దించేలా చేశాయి. ఆ తరువాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటు ఫైనల్ వారం దాకా అరియనా.. వెళ్లటం జరిగింది.
ఆ తర్వాత బయటికొచ్చిన అరియనా… యాంకర్ గా అనేక మంది టాప్ సెలబ్రిటీలను.. ఇంటర్వ్యూ చేస్తూ కెరియర్ కొనసాగిస్తోంది. ఇటీవలే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఆయన జిమ్ములో చిట్టి పొట్టి డ్రెస్సులతో.. ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే త్వరలో బిగ్ బాస్ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో… హోస్ట్ విషయంలో అనేక మంది పేర్లు వినపడుతున్నాయి. మొదటిలో ముచ్చటగా మూడోసారి నాగార్జునని.. షో నిర్వాహకులు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. నాగార్జున ఇటీవల డ్రాప్ అయినట్లు పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి.
Read More: Big Boss: హైదరాబాదుకి పూర్తిగా మకాం మార్చిన బిగ్ బాస్ బ్యూటీ..!!
ఇదే సమయంలో దగ్గుబాటి రానా పేరు తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా అరియనా నీ హోస్ట్ గా తీసుకోవాలని షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు.. లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలామంది టాప్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయడంలో సరైన యాంకరింగ్ చేస్తూ ఉండటంతో షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. సోషల్ మీడియా లో టాక్.