స్వాతంత్ర దినోత్సవ సంబరాలు – కాంతులీనుతున్న ఏపీ సచివాలయం

Share

ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాలు ముస్తాబయ్యాయి. అమరావతిలోని సచివాలయం, శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి. భవనాలు, చుట్టుపక్కల ప్రాంగణమంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోయేలా ఏర్పాట్లు చేసారు.

 

arrangements done for Independence Day celebrations at Andhra Pradesh Secretariat
arrangements done for Independence Day celebrations at Andhra Pradesh Secretariat

 

దీంతో ఆ ప్రాంతం రకరకాల విద్యుత్ దీపాలతో కాంతులీనుతూ ముచ్చటగొలుపుతుంది. రేపు అమరావతి శాసనసభా ప్రాంగణంలో సభాపతి తమ్మినేని సీతారాం జాతీయ పతాకం ఎగురవేయనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే భారీ కార్యక్రమంలో జెండా వందనం చేయనున్నారు. ఈ మేరకు అక్కడ కూడా ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈసారి కరోనా పరిస్థితుల కారణంగా ఎక్కువమందిని లోపలికి అనుమతించట్లేదు. కళాకారుల నృత్య ప్రదర్శనలను కూడా రద్దు చేసింది ప్రభుత్వం.

 


Share

Related posts

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో చేయని ప్రయోగం చెయ్యబోతున్న శర్వానంద్ !!

sekhar

అభి ఆగయా!

somaraju sharma

ఇది ఎప్పటికీ జగన్ మీద చెరిగిపోని ‘బ్యాడ్ రిమార్క్ ‘గా మిగిలిపోనున్నదా?

Yandamuri