NewsOrbit
జాతీయం న్యూస్

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

Rameswaram Cafe Blast Case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ సుతీన్ తహా ను అరెస్టు చేసింది. పేలుడు జరిగిన తర్వాత పరారీలో ఉన్న వీరు అస్సాం, బెంగాల్ లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ కేసులో నిందితుడిని ఒక క్యాప్ (టోపీ) పట్టించింది. నిందితుడు టోపీ కొనడానికి వెళ్లిన సమయంలో అక్కడ సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా  గుర్తించారు. నిందితులు తరచూ సిమ్ కార్డులు మారుస్తూ అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ .. ఎన్ఐఏ రాడార్ నుండి తప్పించుకోలేకపోయారు. పేలుడుకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న నిందితుడు మల్నాడు ప్రాంత వాసి అని ఇప్పటికే దర్యాప్తు సంస్థ గుర్తించింది. గతంలో శివసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి అటవీ విభాగంలో కొందరు యువకులకు ఆయుధాల వినియోగంలో శిక్షణ కూడా ఇచ్చాడని పేర్కొంది.

బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ లో ఉన్న రామేశ్వరం కేఫ్ లో మార్చి నెలలో బాంబు పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది. నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. అతను ఏ మార్గంలో కేఫ్ లోకి వచ్చాడు.. బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు .. అనే అంశంపై సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను విచారించారు.

బాంబర్ కేఫ్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్ధాలు ఉన్న సంచిని అక్కడ పెట్టి హడావుడిగా వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ క్రమంలో అయిదు కిలో మీటర్ల పరిధిలోని వందల కొద్దీ సీసీ కెమెరాల దృశ్యాలను దర్యాప్తు అధికారులు విశ్లేషించారు. టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో టోపీ ఆధారంగా పోలీసులు వేట మొదలు పెట్టడంతో .. నిందితులు టోపీ కొనుగోలు చేస్తున్నప్పటి దృశ్యాలు దర్యాప్తు బృందం చేతికి అందాయి. దాని ఆధారంగానే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?