NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Bangalore Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ అరెస్టు

Bangalore Rave Party Case: కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ 2 గా ఉన్న అరుణ్ కుమార్ ను బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల ప్రకారం.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత రేవ్ పార్టీలో టీడీపీ నేత నారా లోకేష్, ఆ పార్టీ నేతల అనుచరులు ఉన్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఈ కేసులో రెండో నిందితుడుగా ఉన్న అరుణ్ కుమార్ వైసీపీ కీలక నేతలతో దిగిన ఫోటోలను టీడీపీ అనుకూల సోషల్ మీడియా బయటపెట్టింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో ఏ 2గా ఉన్న అరుణ్ కుమార్ .. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకు ముఖ్య అనుచరుడు. బెంగళూరులో ఉంటూ రియర్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అరుణ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మరో పక్క బెంగళూరులోని బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. కాగా, రేవ్ పార్టీ పై పోలీసులు దాడుల నేపథ్యంలో అక్కడి నుండి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, బెంగళూరు రేవ్ పార్టీకి హజరైన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమా, అపీరాయ్ కూడా ఉన్నారు, వీరి బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు అనవాళ్లు గుర్తించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆనవాళ్లు గుర్తించిన వారిని కూడా విచారణకు హజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తొంది.

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N