Mahesh babu – Trivikram: ఆ తమిళ హీరో చేస్తే అల్లు అర్జున్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మహేశ్ పరిస్థితేంటి..?

Share

Mahesh babu – Trivikram: సినిమా ఇండస్ట్రీలో బాగా నెగిటివ్ సెంటిమెంట్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్ విషయంలో మరీ ఎక్కువగా ఉంటుంది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆమెకు వరుసగా అవకాశాలిచ్చే దర్శకుల, నిర్మాతల..హీరోల లిస్ట్ బాగా పెరిగిపోతుంది. పట్టుపట్టి కొందరు హీరోలు ఆమెనే తమ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోమని సూచిస్తుంటారు. అదే హీరోయిన్ మొదటి సినిమా గనక ఫ్లాపైతే ఆలోచిస్తారు. రెండవ సినిమా అవకాశం వచ్చి అది కూడా సక్సెస్ సాధించకపోతే ఇక ఆ హీరోయిన్‌ను పట్టించుకునే వారే ఉండరు.

arya in mahesh-babu-trivikram-movie
arya in mahesh-babu-trivikram-movie

ఇక కొందరు నటుల విషయంలోనూ ఇది రిపీట్ అవుతుంది. తమిళ సీనియర్ హీరో అర్జున్ ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలలో నటించిన సినిమాలు అంతా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. నితిన్ నటించిన లై సినిమాలో అర్జున్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోనూ అర్జున్ నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది.

Mahesh babu – Trivikram: అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో విలన్‌గా తమిళ హీరో ఆర్య నటించాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. దాంతో చాలాకాలం మళ్ళీ తెలుగు సినిమాలలో ఆర్య కనిపించలేదు. ఆ మధ్య మళ్ళీ అనుష్కతో కలిసి సైజ్ జీరో చేస్తే దానీ రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. అయినా మరోసారి ఆర్యను మహేశ్ సినిమా కోసం త్రివిక్రమ్ తీసులోవాలని చూస్తున్నాడట. నెగిటివ్ సెంటిమెంట్ ఉన్న నటుడుని మహేశ్ సినిమా కోసం తీసుకుంటే ఆ సినిమా పరిస్థితేంటి అని ఇప్పుడు అభిమానులు మాట్లాడుకుంటున్నారట. అసలు విషయం ఏంటనేది కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.


Share

Related posts

ప్ర‌తి షోకి గ్రాఫ్ పెరుగుతుంది: నాని

Siva Prasad

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

somaraju sharma

Breaking: ఆకలి తీరుస్తామని తీసుకువెళ్లి అత్యాచారం చేశారు..!!

somaraju sharma