Bigg Boss 5 Telugu: ఆ విషయంలో షణ్ముక్, సన్నీ లకి పోటీగా ఇప్పుడు సిరి..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) సీజన్ ఫైవ్ లో టాగ్ ఆఫ్ వార్ బయట ఎక్కువగా నడుస్తుంది షణ్ముక్, సన్నీ ల మధ్య. ఇద్దరికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఓటింగ్ పరంగా… ఇద్దరు నామినేషన్ల సమయంలో… నువ్వా నేనా అన్నట్టు గా ఓటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. టైటిల్ విన్నర్ వార్ కూడా వీరిద్దరి మధ్య.. పోటీ ఉన్నట్లు బయట భారీగా డిస్కషన్లు జరుగుతున్నాయి. సన్నీ ఆటతీరు ఆల్ రౌండర్ తరహాలో ఉంటే.. షణ్ముక్ మైండ్ గేమ్ తో ఆడుతున్నారు. అదే రీతిలో స్క్రీన్ స్పేస్ పరంగా చూసుకుంటే షణ్ముక్ కి బాగా దొరుకుతుంది. సిరి తో గొడవ పడుతూ మరోపక్క ఇతర ఇంటి సభ్యులు వేసే స్ట్రాటజీ విషయంలో సరిగ్గా డిస్కషన్ పెడుతూ కీలక పాయింట్ రాబడుతూ ఉన్నాడు. గత సీజన్లో అభిజిత్ మాదిరిగా షణ్ముక్ ఆడుతున్నాడు అనే టాక్ నడుస్తోంది. కాగా షణ్ముక్ ఆట తీరు చూస్తే అభిజిత్ కంటే కొద్దిగా…ఆక్టివ్ గా ఉన్నట్లు… చెబుతున్నారు కానీ మైండ్ గేమ్ పరంగా ఇద్దరీ థింకింగ్ ఒకటే అని అంటున్నారు.

BB5 Telugu: సన్నీ విషయంలో తెలియక నోరు జారారు.. తెలిసాక మాట మార్చారు | Bigg  Boss 5 Telugu September 18 Highlights | Bigg Boss 5 Telugu Latest Promo  Today

దీంతో సీజన్ ఫోర్ లో మైండ్ గేమ్ ఆడిన అభిజిత్ మాదిరిగానే సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక సన్నీ విషయానికొస్తే ఫిజికల్ టాస్క్ లేదా ఎంటర్టైన్మెంట్ పరంగా అందరితో కలిసి పోతూ మాస్కులు లేకుండా.. గేమ్ ఆడుతున్నాడు. ఉన్నది ఉన్నట్టు మాటాడేస్తున్నాడు. కానీ కాజల్, మానస్ చెప్పే విషయాలుకి లోంగి పోతూ కొద్దిగా మైనస్ అవుతున్నాడు తప్ప మిగతాదంతా… చాలా పర్ఫెక్ట్ గా గేమ్ ఆడుతున్నాడు.. దీంతో సన్నీ కూడా టైటిల్ విన్నర్ గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పుకొస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఓటింగ్ పరంగా షణ్ముక్, సన్నీ కీలకంగా రాబడుతున్నారు. సీజన్ ఫైవ్ లో వీరిద్దరికీ పడుతున్న ఓట్లు.. సోషల్ మీడియాలో పెద్దఎత్తున డిస్కషన్ కి దారి తీస్తున్నాయి. అయితే ఇంతలో వీరిద్దరికీ పోటీగా మరో కంటెస్టెంట్ ఇటీవల దూసుకు పోతూ వస్తూ ఉంది. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు సిరి. హౌస్ లో ఉన్న ఆడవాళ్ళలో ఫిజికల్ టాస్క్ లేదా ఫుల్ ఎనర్జీతో గేమ్ ఆడే కంటెస్టెంట్ సీరి.

Actress Siri Hanmanth Entered Biggboss House Photos - Lovely Telugu

పదో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో

ఒక పక్క తన ఫ్రెండ్ షణ్ముక్ కి… తోడుగా ఉంటూనే ప్రోత్సహిస్తూనే తన గేమ్ ఆడుతోంది. షణ్ముక్ అలిగిన ప్రతిసారి… బుజ్జగిస్తూ.. ఫ్రెండ్ గా.. తోడుగా ఉంటుంది. ఇదిలా ఉంటే హౌస్ లో చాలావరకు సిరి ఆడుతున్న గేమ్.. బయట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. జెస్సీ అనారోగ్యంగా ఉన్న సమయంలో చాలా అండగా ఉంటూనే మరో పక్క.. తన గేమ్ తాను ఆడుకుంటూ ఒకపక్క ఫ్రెండ్షిప్ కాపాడుకుంటూ.. సీజన్ ఫైవ్ లో.. లేడీ కంటెస్టెంట్ ఎవరు ఆడని రీతిలో ఆడుతూ ఉంది. అంతమాత్రమే కాకుండా చాలామంది అభిమానం సంపాదించుకుంటూ ఉంది. ఈ రీతిగా గేమ్ ఆడుతున్న సిరి.. ఓటింగ్ ప్రక్రియ లో తనదైన శైలిలో దూసుకుపోతోంది. పదో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో సిరి టాప్ కంటెస్టెంట్ గా చలామణి అవుతున్న సన్నీ కంటే ఎక్కువగా ఓట్లు రాబట్టడం ఎప్పుడూ అతిపెద్ద హైలెట్ గా మారింది. ఇదే జోరు కొనసాగితే సిరికి తిరుగులేని ట్రాక్ రికార్డు.. సీజన్ ఫైవ్ లో ఉంటుందని బయట విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఓటింగ్ పరంగా షణ్ముక్, సన్నీ లకి… భారీగా పడుతున్నాయి. అయితే ఇప్పుడు గేమ్ పరంగా ఇంటిలో స్ట్రాంగ్ కావడంతోపాటు ఓటింగ్ పరంగా కూడా భారీ ఎత్తున ఓట్లు రాపడుతుండటంతో సిరి.. ఇదే జోరు కొనసాగితే టాప్ ఫైవ్ లో పాటు టైటిల్ విన్నర్.. అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట జనాలు అంటున్నారు.


Share

Related posts

ఆచార్య మొదలయ్యోది అక్కడే ..?

GRK

బిగ్ బాస్ 4: నాగార్జున ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన సుజాత…!!

sekhar

ఏపీ పోలీసులను ఓ రేంజ్ లో తిట్టుకుంటున్న మందుబాబులు

Siva Prasad