హైదరాబాద్: పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిజెపి వేటువేసింది. అశీష్ గౌడ్ మద్యం మత్తులో పబ్ వద్ద వీరంగం సృష్టించి సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సంజనపై అసభ్యంగా, దౌర్జన్యంగా ప్రవర్తించాడని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎం నరేంద్రరెడ్డి ఆశీష్ గౌడ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ మహిళల సంక్షేమానికి వారి రక్షణకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నరేంద్రరెడ్డి పేర్కొన్నారు. మహిళలపై ఇలాంటి దాడులను బిజెపి సహించదని ఆయన స్పష్టం చేశారు.
previous post