NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ashok Gajapathi Raju: హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు..!!

Ashok Gajapathi Raju: రామతీర్ధం ఘటన నేపథ్యంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసు జారీ చేశారు. అవసరమైనప్పుడు విచారణకు హజరుకావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. కాగా దీనిపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. తన పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో అశోక్ గజపతిరాజు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Ashok Gajapathi Raju filed petition on high court
Ashok Gajapathi Raju filed petition on high court

 

Ashok Gajapathi Raju: శంకుస్థాపన ఫలకాన్ని తొలగించే ప్రయత్నంపై

రామతీర్ధం బొడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునః నిర్మాణ పనుల భూమి పూజ సందర్భంగా సంప్రదాయాలకు విరుద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన ఫలకాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు, అధికారులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా శంకుస్థాపన ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ చర్యలను అశోక్ గజపతిరాజు విమర్శించారు. అశోక్ వ్యాఖ్యలకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలు కౌంటర్ ఇచ్చారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఆలయ ఇఓ వెళ్లి చెప్పినా కావాలనే రాద్ధాంతం చేశారని విమర్శించారు.

Read More: Ramateetham: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు బిగ్ షాక్..! నాన్ బెయిలబుల్ సెక్షన్‌ కింద కేసు నమోదు..!!

అయితే అక్కడ జరిగిన ఘటనను పురస్కరించుకుని ఆలయ ఇఓ ప్రసాద్ నెలిమర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విధులను ఆటంకం కల్గించారని ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఐపీసీ 427, 353 కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనకు తాజాగా సీఆర్పీసీ 41 కింద నోటీసు అందజేశారు. ఆలయాల నిధులను వేరే వాటికి మళ్లించడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశాననీ, అందుకే ప్రభుత్వం తనపై కక్షసాధింపులకు పాల్పడుతోందని అశోక్ గజపతిరాజు ఆరోపించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!