Ashu Reddy: ‘అషూ రెడ్డి’ ఇటీవల కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. మొన్నటవరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న ఈమె తాజాగా యూట్యూబ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కొత్త కొత్త వీడియోలు చేస్తూ తన అభిమానులకు ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌లో అషూ రెడ్డి వీడియోలు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. అయితే, అషూకు కొత్త హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. తనకు బ్యాగ్ నచ్చితే చాలు లక్షల తగలేస్తుంది. ఆ మధ్య కాలంలో అషూ రూ. లక్ష పెట్టి హ్యాండ్ బ్యాగును కొనుగోలు చేసిన విషయం తన తల్లికి తెలియడంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
Ashu Reddy : నా ఫస్ట్ లవ్ పవన్ కళ్యాణ్ అంటున్న అషు.. ఆయన ఒప్పుకోవాలే కానీ..
హ్యాంగ్ బ్యాగ్ విసిరిగొట్టిన అషూ తల్లి
లక్ష విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను అషూ తల్లి విసిరిగొట్టింది. దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. అందుకు కారణం అషూ దుబాయ్‌కు వెళ్లినప్పుడు రూ.లక్ష పెటి హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు చేయడమే. అంతకుముందు కూడా ఇలాంటి పిచ్చి పనులు బాగా చేసిందని ఆమె ఫైర్ అయ్యింది. అషూ కొనే హ్యాండ్ బ్యాగులు మాములుగా ఉండవు. చాలా కాస్ట్లీఅని తెలిసింది. ఒక్కోటి రెండు లక్షలు లేదా రెండున్నర లక్షలు ఉంటాయని తెలుస్తోంది. వాటి ధరలు తెలుసుకుని అషూ తల్లి ముందుగా షాక్ అయ్యింది. నీకు డబ్బుల విలువ తెలియడం లేదంటూ చెడ మడా చీవాట్లు పెట్టేసింది. అంతటితో ఆగకుండా నీకు ఇలా చెబితే అర్థం కాదని తన కూతురికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
Samantha: విడాకుల విషయంలో సమంతాకి సపోర్ట్ గా నిలిచిన బిగ్ బాస్ బ్యూటీ..!!
లక్ష రూపాయల బ్యాగ్‌కు నిప్పు..
అషూ దుబాయ్ నుంచి కొత్త హ్యాండ్ బాగ్ తెచ్చిందని, దాని విలువు లక్షకు పైమాటే అని తెలియడంతో అషూ తల్లి కోపం రెట్టింపయ్యింది. దీంతో ఇంట్లోకి వెళ్లి ఆమె కొనుగోలు చేసిన కాస్ట్లీ బ్యాగను బాల్కనీలో తెచ్చి నిప్పంటించింది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. బంగారం కొనమంటే కొనకుండా ఈ పిచ్చి బ్యాగులను మళ్లీ కొంటవా అంటూ స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చింది అషూ తల్లి..