Ashu Reddy : అషూ రెడ్డి.. జూనియర్ సమంత లా ఆ మధ్య సోషల్ మీడియా సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.. తను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని చాలా సార్లు చెప్పుకొచ్చింది.. తాజాగా ఆమె ఎంతగానో ఆరాధించే పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం వచ్చింది.. ఈ సందర్భంగా ఆయనతో తీసుకున్న ఫోటోలు షేర్ చేసిన అషూకి.. నెటిజన్ల నుంచి విభిన్నమైన కామెంట్స్ వచ్చాయి..
నా దేవుడిని మళ్లీ కలుసుకున్నాను. నేను మాత్రమే కాకుండా, నేను వేసుకున్న టాటూ కూడా గుర్తుందా అని చెప్పారు పవన్ కళ్యాణ్.. సుమారు రెండు గంటలు మాట్లాడుకున్నాము. ఎంతో సంతోషంగా అనిపించింది. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్ లెటర్ కూడా ఇచ్చారు. మీరు ఎప్పటికీ నా ఫస్ట్ లవ్ కళ్యాణ్.. అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శకుడు క్రిష్ కు థాంక్స్ తెలిపింది.
అంతేకాకుండా ” మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను” అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ రాసిన లేఖను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు నుంచి కంగ్రాట్స్ తో పాటు విభిన్న కామెంట్స్ చేస్తున్నారు.. ఓ నెటిజన్ నుంచి ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీకు నాలుగో భారీగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా.. అని ప్రశ్నించగా తప్పకుండా ఓకే చెబుతా అంటూ బదులిచ్చింది. అషూ ఆన్సర్ తో దిమ్మతిరిగిన నెటిజన్లు.. ఈ కామెంట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..