ప్రముఖ నటి సమంత మొన్నటి వరకు టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ప్రముఖ నటి తాప్సీ మొట్టమొదటిసారి నిర్మిస్తున్న బాలీవుడ్ సినిమాలో సమంత కనిపించనుంది. అలాగే మరి కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటించనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో అక్షయ్ కుమార్తో కలిసి పాల్గొంది. ఈ అప్కమింగ్ ప్రోమోని కరణ్ తన ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.
సమంత, అక్షయ్
కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడో సీజన్లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఇప్పటికే ఆలియా భట్, రన్వీర్ సింగ్, జాన్వి కపూర్, సారా అలీ ఖాన్ సందడి చేశారు. తాజాగా ‘కాఫీ విత్ కరన్ 7’షో లో మన టాలీవుడ్ బ్యూటీ సమంత, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు.
అక్షయ్ మామూలోడు కాదు
“హార్ట్ ఆఫ్ గోల్డ్, డ్యాష్ ఆఫ్ సెక్సీ బోల్డ్ నా షో”కి విచ్చేసారు అంటూ కరణ్ వారిని షోలోకి ఆహ్వానించారు. అలా షోలోకి ఎంటర్ అవుతూ సమంతాను తన చేతులపై ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు హీరో అక్షయ్ కుమార్. అనంతరం ఇద్దరూ సీట్లో కూర్చొని కరణ్ అడిగే ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సామ్ సమాధానమిస్తూ… ‘పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండకపోవడానికి కారణం మీరే’నని చెప్పి షాక్ ఇచ్చింది. బెస్ట్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీని హోస్ట్ చేస్తే బాలీవుడ్లో ఏ ఇద్దరు హీరోలతో మీరు డ్యాన్స్ వేస్తారు? అని కరన్ ప్రశ్నించాడు. దానికి సమంత రణ్ వీర్ సింగ్ పేరు చెప్పింది. ఇక ఆ షోలో సరదాగా సామ్, అక్షయ్ కుమార్ డాన్స్ వేశారు. అక్షయ్ కుమార్ సమంతను తన చేతితో ఎత్తుకొని తిప్పేశాడు. ఈ షో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.