NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ విష‌యంలో ఆ రాష్ట్ర మ‌హిళ‌లే టాప్.. విష‌యం తెలిస్తే షాక్ అవుతారు!

మ‌హిళ‌లు పురుషుల‌తో స‌మానంగా అన్ని రంగాల్లో దూసుపోతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇది ఉద్యోగాల విష‌యంలోనే కాకుండా మ‌ద్యం తాగ‌డంలో కూడా అంటూ ఓ స‌ర్వే చెబుతోంది. అయితే ఈ మద్యం తాగ‌డంలో అసోం రాష్ట్ర మహిళలు అందరి కంటే ముందు వ‌రుస‌లో దూసుకుపోతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బ‌య‌ట‌ప‌డింది. 2019-20లో తీసుకున్న‌ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. 15 నుంచి 49 ఏళ్ల‌ వయసున్న అసోం మహిళల్లో 26.3 శాతం మంది మద్యం తాగుతున్నార‌ని ఈ స‌ర్వే చెబుతోంది. మేఘాలయ రాష్ట్రంలో ఇది 8.7 శాతం ఉంది.

15 నుంచి 49 ఏళ్ల లోపు ఉండే మహిళలు దేశవ్యాప్తంగా మద్యం సేవిస్తున్నది 1.2 శాతం మాత్రమే.. 2015-16లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ నివేదికలో ఈ గణాంకాలను తెలిపారు. అయితే 2018-19లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వే నివేదిక విడుదల కావాల్సి ఉంది. మరోవైపు 2005-06లో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వే ప్రకారం 15-49 ఏళ్ల‌ వయసున్న అసోం మహిళల్లో మద్యం తాగేవారు 7.5%గా ఉంది.

2005-06 ఎన్ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలో అసోం కన్నా ఐదు రాష్ట్రాలు ముందంజ‌లో ఉన్నాయి. అవి అరుణాచల్‌ ప్రదేశ్‌ (33.6శాతం), సిక్కిం (19.1శాతం), ఛత్తీస్‌గఢ్‌ (11.4శాతం), జార్ఖండ్‌ (9.9శాతం), త్రిపుర (9.6శాతం) ముందంజ‌లో ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3 లో అసోంలో మద్యం సేవించే మహిళలు 7.5% ఉండగా సర్వే 4లో ఇది 26.3 శాతానికి పెరిగింది. మరోవైపు సర్వే-3లో టాప్‌లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ (3.3శాతం), సిక్కిం (0.3శాతం), ఛత్తీస్‌గఢ్‌ (0.2శాతం), జార్ఖండ్‌ (0.3శాతం), త్రిపుర (0.8శాతం)గా గణాంకాలు త‌గ్గిపోయాయి.

దేశవ్యాప్తంగా వారానికోసారి మద్యం తాగే మహిళలు 35 శాతం మంది ఉన్నారు. అదే ఒక్క‌ అసోంలో 44.8 శాతం మంది ఉన్నారు. 15-49 ఏళ్ల‌ వయసున్న మగవారు అసోంలో 35.6 శాతం మంది మద్యాన్ని తాగుతున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో వీరి సంఖ్య 59 శాతంగా ఉంది. పొగా తాగ‌డంలో కూడా దేశవ్యాప్తంగా చూసిన‌ప్పుడు అసోం మహిళలు 60 శాతంగా, పురుషులు 17.7శాతంగా ఉండి, టాప్‌లో నిలిచారు.

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju