అసెంబ్లీ సీట్ల పెంపు ఇక లేనట్లే!

ఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో లేనట్టే. రాజ్యసభలో ఎంపి సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ ఈ మేరకు స్పష్టం చేస్తూ లిఖిత పూర్వకంగా తెలియజేశారు.  రాజ్యాంగంలోని 170(3) అధికరణ ప్రకారం 2026 తరువాత సేకరించే జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్ర విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్న విషయం విదితమే.  ఆంధ్రప్రదేశ్‌లో 175 నుండి 225, తెలంగాణాలో 119నుండి 153కు పెంచాలని నిర్దేశించారు.