“సాయం”పైనే తొలి సంతకం

అమరావతి, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం సీఎంఆర్‌ఏఫ్ ఫైల్‌పై చేశారు. “సమాచార శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం” వైద్య చికిత్సల సాయం కోసం 7,386 అర్జీలు రాగా 6,207 అర్జీలను పరిష్కరించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదల చేసిన రీ ఇంబర్స్‌మెంట్ సొమ్ము మొత్తం 34,50,59,383 రూపాయలు
ఎల్‌ఓసీలకు వచ్చిన దరఖాస్తులు 1179, విడుదల చేసిన సొమ్ము మొత్తం 19, 13, 41,055రూపాయలు
రీఇంబర్స్‌మెంట్, ఎల్‌ఓసీలు కలపి విడుదల చేసిన సొమ్ము మొత్తం 53,64,00,438రూపాయలు
2014 నుంచి నేటి దాకా సీఎం ఆర్‌ఎఫ్ నుంచి విడుదల చేసిన సొమ్ము మొత్తం 1249.56 కోట్ల రూపాయలు