తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల్లోని విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చెన్నాయుడుకు ఈసారి అవకాశం లభించేటట్లుంది. పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా అచ్చెన్నాయుడు పేరుని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
Latest Telugu News in News orbit, Today telugu news, Telugu news orbit news, News orbit telugu updates Latest Telugu News in News orbit, Today telugu news, Telugu news orbit news, News orbit telugu updates
ఇదే అభిప్రాయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వద్ద కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా చంద్రబాబు కూడా అచ్చెన్నాయుడుకే ఓటు వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. టీడీపీ ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసింది. దీంతో లోక్ సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమిస్తారు. ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీల ప్రక్రియను పూర్తి చేస్తారు. దాని తర్వాత పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి చేస్తారని తెలుస్తోంది.