NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌ను కెలికిన అచ్చెన్నాయుడు…ఏం జ‌ర‌గ‌నుందో?

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత అచ్చెన్నాయుడు ఇటీవ‌లే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మితుడైన సంగ‌తి తెలిసిందే. పార్టీ త‌ర‌ఫున బ‌లంగా గ‌లం వినిపించ‌డం, ఉత్త‌రాంధ్ర కావ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చిన అంశాలు.

కొత్త ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అచ్చెన్నాయుడు ఎప్ప‌ట్లాగే త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి, ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు దానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లింక్ పెట్టారు.

నెల‌ల నిరీక్ష‌ణ‌కు బ్రేక్‌

క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో నిలిచిపోయిన తెలంగాణ-ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు రవాణా అంశంలో చర్చలు జ‌రిగి ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండిల సమావేశంలో ఈ మేర‌కు ఒప్పందం కుదిరింది. అయితే, ఈ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఎ.పి.ఎస్.ఆర్.టి.సిని ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెట్టార‌ని మండిప‌డ్డారు. తెలంగాణాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి ధారాదత్తం చేస్తున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సైతం త‌మ వివాదంలోకి లాగారు.

జ‌గ‌న్ అనాలోచిత నిర్ణ‌యం

ఆర్టీసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అనాలోచితం అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. “ ఈ ఒప్పందం ప్రజలకు అసౌకర్యంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. 2,65,367 కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతున్న ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ఇప్పుడు 1,04,368 కిలోమీటర్లు కోల్పోవడానికి కారణం ప్రభుత్వ చేతకానితనం కాదా? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రోజుకి లక్ష కిలోమీటర్లు, 250 బస్సులు నడిపే హక్కును ఎ.పి.ఎస్.ఆర్.టి.సి కోల్పోవడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం కాదా? ప్రజలకు సేవలు విస్తృతం చేయాల్సిన సమయంలో సర్వీసులు తగ్గించుకోవాల్సిన అవసరం ఏమిటి?“ అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

అంతా న‌ష్ట‌మే…

లక్ష కిలోమీటర్ల మేర తగ్గించుకోవడంతో ఎ.పి.ఎస్.ఆర్.టి.సి మరింత నష్టపోవడంతో పాటు కార్మికులు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని అచ్చెన్నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాలంటే రాష్ట్ర ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థతి నెలకొంది. “అని కామెంట్ చేశారు. కాగా, అచ్చెన్నాయుడు కామెంట్ల‌పై తెలంగాణ నేత‌లు ఏ విధంగా స్పందిస్తారో మ‌రి.

author avatar
sridhar

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju