NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

దీపావళి వేళ..! ఆత్మనిర్భర్ భారత్ 3.O …!!

 

 

కరోనా మహమ్మారి దేశాన్ని ఆర్ధికంగా ఆరోగ్య పరంగా ఎంతో నష్టపరిచింది. ఆరోగ్య పరంగా వ్యాక్సిన మూడోవ దశ ట్రైల్స్ లో ఉండగా. ఆర్ధికంగా కూడా దేశం ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటుంది. దేశ ఆర్ధిక వ్యవస్థను గాడి లో పెట్టేందుకు ఇప్పటికే రెండు ఉద్దీపన ప్యాకేజిలను ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం, తాజా గా మూడోవ ఆత్మనిర్భర్ భారత్ 3.O ను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ ఉద్దీపన ప్యాకేజిలో భాగంగా 12 కీలక ప్రకటనలు చేసారు. దీన్ని కోసం కేంద్ర ప్రభుత్వం 2 .65 లక్షల కోట్లు వెచ్చించునట్లు తెలిపింది. ఉద్యోగ కల్పనపై ప్రోత్సాహకాలు మరియు అనారోగ్య ఆర్థిక వ్యవస్థ యొక్క కీలకమైన రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన చర్యలతో సహా – ప్రభుత్వానికి రూ .2,65,080 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కోవిద్-19 తో జరిగిన యుద్ధంలో ఆర్థిక వ్యవస్థకు అందించిన మొత్తం ద్రవ్య మరియు ఆర్థిక సహాయాన్ని 29,87,641 కోట్ల రూపాయలకు తీసుకుంటుంది, ఇది దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లో సుమారు 15 శాతానికి సమానం అని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇప్పటివరకు మొత్తం ఉద్దీపనలో, 7 12,71,200 కోట్ల విలువైన రిజర్వ్ బ్యాంక్ చర్యలు ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు 1.0 కు 10 1,102,650 కోట్లు, 2.0 కు 73,000 కోట్లు వెచ్చించారు.

 

కరోనా మహమ్మారి ముందు కంటే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టడం తో ఆర్ధిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అన్నారు. గత 10 రోజులుగా చూస్తుంటే బలమైన రికవరీ సూచనలు కనిపిస్తున్నాయన్నారు. జీఎస్టీ కలెక్షన్లు, బ్యాంక్ క్రెడిట్స్, ఎఫ్‌డీఐ ఫ్లో ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో జీఎస్టీ కలెక్షన్లు ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగాయని, లక్ష 5 వేల కోట్లు వాసులు చేసినట్లు ఆమె తెలిపారు. బ్యాంకు క్రెడిట్స్ 5.1 శాతం పెరిగిందని, ఎనర్జీ వినియోగం కూడా రికార్డ్‌స్థాయికి పెరిగిందన్నారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీ స్పష్టంగా జరుగుతోందని అనేక సూచికలు చూపిస్తున్నాయి . ప్రభుత్వం క్రమపద్ధతిలో తీసుకువచ్చిన నిరంతర సంస్కరణల ఆధారంగా బలమైన రికవరీ ఉంది ”అని ఆర్థిక మంత్రి మీడియా సమావేశంలో అన్నారు.

ఆత్మ నిర్బర్ రోజ్ గార్ యోజన:
ఆత్మ నిర్బర్ 3.0 లో ముఖ్యం అయ్యింది ఆత్మ నిర్భర్ రోజ్ గార్ యోజన,లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకి, ఈ పధకం కింద ఉద్యోగాల ప్రక్రియ చేపట్టనుంది. ఈ యోజన కింద
ఎంప్లొయీమెంట్ ప్రోవిడెంట్ ఫండ్ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు, కొత్త ఉద్యోగుల్ని తీసుకున్న వాళ్లకి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ లో రెండేళ్ల పాటు సబ్సీడీ కలిపిస్తునట్లు తెలిపారు. 1000 మంది ఉద్యోగులు కంటే తక్కువ ఉండే సంస్థలకు ఉద్యోగుల వాటా, సంస్థల వాటా పీఎఫ్ మొత్తం 24 శాతం కేంద్రమే భరించనుంది. వెయ్యి మంది కంటే ఎక్కువ ఉండే సంస్థలకి మాత్రం ఉద్యోగులకి మాత్రమే పీఎఫ్ వాటాను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏదైనా కంపెనీ మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీలోపు కొత్తవారిని ఉద్యోగంలో చేర్చుకున్నా లేదా అంతకుముందు ఉద్యోగం కోల్పోయిన వారిని ఎవరినైనా చేర్చుకున్నా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్:
ఈ యోజన కింద నగరాలలో ఉండే ఆర్థికపరంగా బలహీన వర్గం,తక్కువ ఆదాయం సమూహం కల్గిన వారికి ఇంటిని నిర్మించుకోవడానికి, హోసింగ్ లోన్ పైన చెల్లించాల్సిన మొత్తం మీద వడ్డీ రాయితీ లభిస్తుంది. దీన్ని కోసం గాను రూ.18,000 కోట్ల అదనపు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు నిర్మల. ఈ అదనపు నిధుల వల్ల మరో 12 లక్షల ఇళ్లు పూర్తవుతాయని, మొత్తం 18 లక్షల ఇళ్లు పూర్తవుతాయని తెలిపారు.

సబ్సిడీ ఫెర్టిలైజర్స్:
రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో, సబ్సిడీ ఫెర్టిలైజర్స్ యోజన ద్వారా రూ.5,000 ఆర్ధిక సహాయం అందచేయనుంది. ఖరీఫ్ పంటకు రూ.2,500, రబీ పంటకు మరో రూ.2,500 అందించాలని సూచించింది. దీన్ని కోసం రూ.65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ యోజన:
వ్యూహాత్మక పెట్టుబడులకోసం, నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) పేరుతో నిధిని ఏర్పాటు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, దీన్ని కోసం ఈ ఆత్మ నిర్భర్ లో డెబిట్ ప్లాట్‌ఫాంలోకి రూ.6,000 కోట్ల ఈక్విటీని ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నట్లు నిర్మల తెలిపారు.

పీఎం గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన:
పల్లె ప్రాంతాల్లో నివసిస్తోన్న శ్రామికులైన యువతకు సంక్షేమం, ఉపాధి కోసం గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. దీన్ని కోసం ఈ ఆత్మ నిర్భర్ యోజన లో అదనంగా రూ.10,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీం:
ఈ స్కీంలో భాగంగా ఒత్తిడిలోని 26రంగాలకు భారీ ప్యాకేజీ ను ప్రకటించింది నిర్మలా సీతారామన్. ఈ పథకం కింద అదనపు క్రెడిట్ కాలపరిమితి 5 ఏళ్లుగా తెలిపారు. ఈ పథకంలో ప్రిన్సిపుల్ అమౌంట్ తిరిగి చెల్లించే కాలపరిమితిపై ఏడాది పాటు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ స్కీం మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకం అర్హత కోసం టర్నోవర్ పరిమితి లేదని తెలిపారు. దీనిలో అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీ బ్యాటరీ (రూ.18,100 కోట్లు), ఎలక్ట్రానిక్స్/టెక్నాలజీ ప్రోడక్ట్స్ (రూ.5,000 కోట్లు), ఆటోమొబైల్స్ అండ్ ఆటో కాంపోనెంట్ (రూ.57,042 కోట్లు), ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ (రూ.15,000 కోట్లు), టెలికం అండ్ నెట్ వర్కింగ్ ప్రోడక్ట్స్ (రూ.12,195 కోట్లు), టెక్స్‌టైల్ ఉత్పత్తులు (రూ.10,683 కోట్లు), ఫుడ్ ప్రోడక్ట్స్ (రూ.10,900 కోట్లు), హైఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యూల్స్ (రూ.4500 కోట్లు), వైట్ గూడ్స్ (ఎసీలు, ఎల్ఈడీలు) (రూ.6,238 కోట్లు), స్పెషలిటీ స్టీల్ (రూ.6,322 కోట్లు) ఉన్నాయి.

ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ :
ఈ పధకం కింద రూ.2.05 లక్షల కోట్లు మంజూరు చేసింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ స్కీం కింద ఇప్పటి వరకు 61 లక్షల రుణగ్రహీతలకు రూ.2.05 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు నిర్మల తెలిపారు. ఇందులో రూ.1.52 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. వడ్డీరహిత రుణాల కోసం 11 రాష్ట్రాలకు రూ.3,621 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అదనపు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కింద ట్రాన్సుపోర్ట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌కు రూ.25,000 కోట్లు సమకూర్చినట్లు తెలిపారు. మే నెలలో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ అభియాన్ మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు.

కోవిడ్ వ్యాక్సీన్ అభివృద్ధి కోసం రూ.900 కోట్లు:
కరోనా మహమ్మారి వ్యాక్సీన్ కోసం 900 కోట్ల ప్యాకేజి ను విడుదల చేసింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాలు కరోనా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. నేడు ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో భాగంగా వ్యాక్సీన్ అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఇప్పటికే పూణే లో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ కోవిషిల్డ్ మూడోవ దశ ట్రైల్స్ కోసం నమోదు చేసుకొంది.

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?