Subscribe for notification

Atmakur By Poll: మళ్లీ బీజేపీ ఒంటరిగానే ..! ఆత్మకూరు బీజేపీ అభ్యర్ధి ఖరారు..! నేడు నామినేషన్

Share

Atmakur By Poll: రాష్ట్రంలో బీజేపీ – జనసేన పొత్తుతో ప్రయాణం చేస్తున్నామని చెబుతున్నా నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇంతకు ముందు కడప జిల్లా బద్వేల్ లోనూ జనసేన మద్దతు లేకుండానే బీజేపీ పోటీ చేసింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకే వైసీపీ అభ్యర్ధిగా నిలిపిన నేపథ్యంలో గత సంప్రదాయాన్ని అనుసరించి జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ కూడా గత సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీ చేయడం లేదని తెలిపింది. బీజేపీ మాత్రం తమ అభ్యర్ధిని ప్రకటించింది. జనసేన మద్దతు లేకుండానే బీజేపీ ఒంటరిగానే మరో సారి బరిలో దిగుతోంది.

Atmakur By Poll BJP Candidate bharat Kumar

Atmakur By Poll: ఆరుగురు నేతల పేర్లు పరిశీలించి..

ఆత్మకూరు బీజేపీ అభ్యర్ధిత్వం కొరకు మొత్తం ఆరుగురు పేర్లను అధిష్టానానికి పంపగా బీసీ వర్గానికి చెందిన భరత్ కుమార్ ను తమ అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించింది. భరత్ కుమార్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కావలి పట్టణ అధ్యక్షుడుగా, బీజేవైఎం నేతగా పలు బాధ్యతలు నిర్వహించారు. భరత్ కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. భరత్ కుమార్ బీసీ వర్గానికి చెందిన నాయకుడనీ, అసలైన సామాజిక న్యాయం బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

నామినేషన్ ధాఖలు కార్యక్రమంలో సోము వీర్రాజు

భరత్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు పర్వంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు నేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు నెల్లూరు చేరుకున్నారు. కాగా వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న వైసీపీ నేతలు మెజార్టీపైనే అంచనాల్లో ఉన్నారు.


Share
somaraju sharma

Recent Posts

Thaman: ఇండస్ట్రీలో ఆ ఇద్దరి హీరోలకు మ్యూజిక్ కొట్టడం చాలా కష్టం అంటున్న తమన్..!!

Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…

20 mins ago

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

1 hour ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

2 hours ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

3 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago