అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ నోటిఫికేషన్

భారత ప్రభుత్వ అను శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ atomic minerals directorate for exploration and research కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ పోస్టులకు కింద తెలిపిన ఈ మెయిల్ కి సంబంధిత అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

 

atomic minerals directorate for exploration and research notification see the details

మొత్తం ఖాళీలు 35 పోస్టులు

1.ప్రాజెక్ట్ అసోసియేట్-1జియాలజీ : 17 పోస్టులు
అర్హతలు : జియాలజీ, అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియో కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 23/1/2021 నాటికి అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 27 సంవత్సరాలు దాటకూడదు.
వేతనం : నెలకు రూ.31000 దీనితో పాటు హెచ్ఆర్ఏ అలవెన్సులు అదనంగా చెల్లిస్తారు.

2. లేబరేటరీ అసిస్టెంట్ ఫిజిక్స్ : 10 పోస్టులు
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ జువాలజీ సబ్జెక్టుల్లో బిఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 23/1/2021 నాటికి అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 30 సంవత్సరాలు దాటకూడదు.
వేతనం:  నెలకు రూ. 20000 దీనితో పాటు హెచ్ఆర్ఏ అలవెన్సులు అదనంగా చెల్లిస్తారు.

3. లేబరేటరీ అసిస్టెంట్ : 8 పోస్టులు
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ జువాలజీ సబ్జెక్టుల్లో బిఎస్సి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 23/1/2021 నాటికి అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 30 సంవత్సరాలు దాటకూడదు.
వేతనం : నెలకు రూ. 20000 దీనితో పాటు హెచ్ఆర్ఏ అలవెన్సులు అదనంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం : ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వారి అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈమెయిల్: [email protected] ఈ మెయిల్ కు అర్హత , అనుభవం క్యాస్ట్ సర్టిఫికెట్ , ఇతర ధ్రువ పత్రాలు జత చేసి పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 23/1 /2021