న్యూస్

Attack on Gopalapuram MLA: వైసీపీ ఎమ్మెల్యేపై దాడి.. అసలు కారణాలు ఇవే..!

Share

Attack on Gopalapuram MLA: వైసీపీ ఎమ్మెల్యేపై దాడి.. అసలు కారణాలు ఇవే..! సీఎం జగన్ సూచనలు, ఆదేశాలతో ఇప్పుడిప్పుడే జనంలోకి వెళ్లాలనుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు చేదులాంటి వార్త ఇది.. పార్టీలో విబేధాలను, గ్రూపులను పరీక్షకరించకుండా జనంలోకి వెళ్తే.. పరిస్థితి ఏమిటనేది ఈ ఘటన ద్వారా పార్టీ పెద్దలకు తెలిసే ఉంటుంది..! ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఈరోజు దాడి జరిగింది. ద్వారకాతిరుమల మండలం జీ. కొత్తల్ల్లి గ్రామస్తులు ఆయనపై దాడి చేసారు.. పోలీసులు గనక లేకపోయినా.. సమయానికి అడ్డుకోకపోయినా పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది.. ఈ దాడి ఎందుకు జరిగింది..!? అసలు కారణం ఏమిటి..!? అనేది పరిశీలిస్తే..

Attack on YCP MLA .. Here are the real reasons ..!
Attack on YCP MLA .. Here are the real reasons ..!

ఈ నియోజకవర్గంలో వైసీపీలో భిన్నమైన వర్గాలున్నాయి. దాదాపు ప్రతీ గ్రామంలో పెద్ద విభేదాలున్నాయి. జీ,. కొత్తపల్లి గ్రామంలో కూడా వైసీపీ గ్రామా అధ్యక్షుడు గంజి ప్రసాద్ ఉన్నారు.. ఆయనకు వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూపు ఉంది. ఈ గ్రామంలో గ్రూపుల విషయంలో ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఓ వర్గాన్ని వెనకేసుకొస్తున్నారని ఎప్పటి నుండి ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంజి ప్రసాద్ ని ఈరోజు కొందరు హత్య చేసారు. మెడపై కత్తితో దాడి చేసి, దారుణంగా చంపేశారు. ఈ హత్యా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే పరామర్శకు వచ్చారు.. ఎమ్మెల్యే కనిపించిన వెంటనే గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యువకులు అందరూ గుమిగూడారు.. ఎమ్మెల్యేని చుట్టుముట్టి దాడి చేసారు. అందినకాడికి కొట్టారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఎమ్మెల్యేను రక్షించే ప్రయత్నం చేసారు. ఎమ్మెల్యే వెంకట్రావు కూడా అక్కడి నుండి పరిగెత్తి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్థులు, యువకులు వెంబడించి కొట్టారు. పోలీసులు సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచారు./ లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది..! ఈ ఘటన ఇప్పడూ వైసీపీ వర్గాల్లో కొత్త భయాన్ని కలిగిస్తుంది. ఆ పార్టీలో విబేధాలను పిచ్చి చూపుతుంది..!


Share

Related posts

బిగ్ బస్ 4: ఆఖరి నిమిషంలో మాటీవీ ప్రేక్షకులకి షాక్ ఇచ్చిన గంగవ్వ !!

sowmya

Prashant Kishor : పీకే కూడా కాపాడలేని స్థితిలో మమత..! బెంగాల్ లో రాజకీయ సంచలనం..!?

Yandamuri

చంద్రబాబు బ్రోకర్, రైతు కాదు అంటున్న మంత్రి..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar