ఈటీవీలో ప్రతి పండగకు ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వస్తుంది. ప్రేక్షకులను అలరించడం కోసం ఈటీవీ కానీ.. మల్లెమాల వాళ్లు కానీ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తుంటారు. ఈసారి సంక్రాంతి పండగ రోజున బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి అత్తో అత్తమ్మ కూతురో అనే ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. మొత్తానికి సంక్రాంతి రోజున ఎంటర్ టైన్ మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఈ ప్రోగ్రామ్ రాబోతోంది.

దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలను కూడా విడుదల చేశారు. సాధారణంగా ఈటీవీ ప్రోగ్రామ్స్ అంటేనే ఎక్కువగా కనిపించేది రోజా, యాంకర్ అనసూయ, హైపర్ ఆది, రష్మీ, యాంకర్ ప్రదీప్ ఇంకా జబర్దస్త్ కంటెస్టెంట్లు ఎవరైనా ఉంటే వాళ్లు కూడా వచ్చి స్కిట్లు చేసి నవ్విస్తారు.
కానీ.. ఈసారి అత్తో అత్తమ్మ కూతురో షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఎవరో తెలుసా? జబర్దస్త్ జంట ఇమ్మాన్యుయేల్, వర్ష. ఇద్దరి రొమాన్స్ ఈ షోలో అదిరిపోయింది. మామూలుగా లేదు ఈ జంట. సుధీర్, రష్మీని మించిపోయారు వీళ్లు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ జంట గురించే చర్చ. వామ్మో.. వీళ్లేంది ఇలా రెచ్చిపోతున్నారు.. అనే విధంగా.. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల మతిపోగొడుతోంది.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా తాజాగా విడుదలైన ప్రోమోను చూసి ఇమ్మాన్యుయేల్, వర్ష జంట రొమాన్స్ చూసేయండి..