అఫీషియల్ న్యూస్ రాకుండానే పవన్ కళ్యాణ్ సినిమా కి మొదలైన రచ్చ ..?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత మలయాళ హిట్ సినిమా అయ్యప్పనమ్‌ కోషియమ్ తెలుగు రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. బీజూ మీనన్ రోల్ అయిన పోలీస్ ఆఫీసర్ ‌గా నటించనున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.12గా రూపొందిస్తున్నారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తుండగా టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నాడు.

Pawan Kalyan may star in Ayyappanum Koshiyum Telugu remake

కాగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ నటించాల్సిన సీన్స్ వరకు 25 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని డిసైడయినట్టు సమాచారం. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ పక్కన సాయిపల్లవి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ మాత్రం ఇంకా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించలేదు.

Sai pallavi with Pawan Kalyan in Ayyappanum Koshiyum Telugu remake? -  Movies News

కాని సోషల్ మీడియాలో మాత్రం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన సాయి పల్లవి నటిస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతారు. పైగా సాయి పల్లవి పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ కూడా. ఇక పర్ఫార్మెన్స్ పరంగా సాయి పల్లవి అద్భుతంగా నటిస్తుందన్న సంగతి తెలిసిందే.

కాని కొంతమంది చేస్తున్న కామెంట్స్ మాత్రం కరెక్ట్ గా లేవన్న టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ని సాయి పల్లవి డామినేట్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. నిజంగా అంత బాగా పర్ఫార్మ్ చేస్తే మంచిదే. అందరూ కోరుకునేది కూడా అదే. కాని అది నెగిటివ్ యాంగిల్ చూస్తూ కామెంట్ చేయడం సబబు కాదని అంటున్నారు. ఇక ఈ సినిమా లో నిజంగా సాయి పల్లవి నటిస్తుందా లేదా అన్నది వెల్లడి కావాల్సి ఉంది.