టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్ బ్రహ్మానందం ఈ మధ్య కాలం లో సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. బ్రహ్మానందం తన హార్ట్ సర్జరీ తర్వాత ఎక్కువగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. కానీ, ఇప్పుడిప్పుడే మళ్లీ ఆయన సినిమా లు చెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు సినిమాల లో హీరో ఎవరైనప్పటికీ ఆ సినిమా లో కచ్చితం గా బ్రహ్మానందం ఉండే లా చూసుకునే వారు. ఎందుకంటే ఒక సినిమాకి హీరో తో పాటుగా కమెడియన్ కూడా అంతే అవసరం కాబట్టి. అంతటి క్రేజ్ ఉన్న బ్రహ్మానందం ఈ మధ్య సినిమాల లో అసలు కనిపించడం లేదు.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం బ్రహ్మానందం త్వరలోనే ఒక కొత్త క్యారెక్టర్ లో కనిపించనున్నారట. అంతేకాకుండా ఇక మీదట బ్రహ్మానందం చెయ్యబోయే సినిమాలు అన్నీ కూడా ఇలానే ఉంటాయట. కృష్ణవంశీ డైరక్షన్ లో రంగమార్తాండా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లో బ్రహ్మానందం రోల్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ కి బిన్నంగా ఉండడంతో ప్రేక్షకులు కచ్చితంగా సర్ ప్రైజ్ అవుతారని అంటున్నారు. ఇన్నాళ్ళు మనలని సినిమాల్లో తన కామెడీ తో నవ్వించిన బ్రహ్మానందం ఈ సినిమాలో ఏడిపిస్తాడట. గతంలో బ్రహ్మానందం తనదైన శైలిలో బాబాయ్ హోటల్ సినిమాలో ఒక సీరియస్ రోల్ లో నటించారు.
కానీ ఆ సినిమా తర్వాత బ్రహ్మానందం ఇక కమెడియన్ గానే కొనసాగారు. రంగమార్తాండ సినిమా తరువాత నుంచి బ్రహ్మి సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ రోల్స్ చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఇన్నాళ్లు నవ్వించి అలరించిన బ్రహ్మానందం ఇక మీదట ఏడిపించనున్నారట.