లంచ్ టైంకి ఆసీస్ 89/4

భారత్ తో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకూ ఇరు జట్లూ 1-1తో సమానంగా ఉన్న సంగతి తెలిసిందే. మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 7 వికెట్లో కోల్పోయి 443 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 8 పరుగులు చేసింది.
8/0 ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. జడేజా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ పడగొట్టగా, బుమ్రా రెండు వికెట్లు తీసుకున్నాడు. హారిస్ 22 పరుగులకు బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఫించ్ ఎనిమిది పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔటౌ పెవిలియన్ కు చేరాడు. ఇక ఖాజ్వాను జడేజా ఔట్ చేశాడు. ఖాజ్వా 21 పరుగులు చేశాడు. ఇక మార్ష్ ను లంచ్ విరామ సమయానికి ముందు చివరి బంతికి బుమ్రా లెగ్ బిఫోర్ గా ఔట్ చేశాడు.