Categories: న్యూస్

Viral: ఇలాంటి శిక్ష ఎవరికీ పడకూడదు.. మరీ 8,000 సంవత్సరాలా?

Share

8000 years punishment: అవును.. ఇలాంటి శిక్ష ఎవరికీ పడకూడదు. పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదు. మరీ 8,000 సంవత్సరాల శిక్ష అంటే నమ్మతరమా? ఈ కథ వింటే ఖచ్చితంగా నమ్మి తీరుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మనం ఏ దేశానికెళ్లినా ముందు అక్కడి చట్టాలపై కొంత అవగాహన తెచ్చుకోవాలని కొంతమంది విజ్ఞులు చెబుతూ వుంటారు. నిజమే. అయితే ఇజ్రాయెల్‌ దేశంమీద ఎలాంటి అవగాహన లేని ఓ ఆస్ట్రేలియా (Australia) వ్యక్తి ఇజ్రాయెల్‌ (Israel) వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. కట్ చేస్తే.. ప్రపంచమే విస్తుపోయేటువంటి కోర్టు తీర్పును పొందాడు. ఆ కథేంటో ఇపుడు తెలుసుకుందాం.

అతని కథను తెలుసుకోండి మరి!

44 ఏళ్లు వయసు కలిగిన ‘నోమ్ హప్పెర్ట్’ ఆస్ట్రేలియాకి చెందిన వ్యక్తి. అతనికి ఇజ్రాయెల్ దేశంలో 8000 సంవత్సరాల శిక్ష పడింది. ఎందుకంటే, నోమ్ ఆస్ట్రేలియాలో వున్నపుడు తనకు పరిచయమైన ఓ ఇజ్రాయెలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా వారికి పిల్లలు పుట్టారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వారి కాపురంలో కలతలొచ్చాయి. ఇక తాము కలిసి బతకలేం అని నిర్ణయించుకొని విడాకులు తీసుకోవడం మేలు అనుకొని ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం విడాకులు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఆమె… తనను, పిల్లల్నీ ఇజ్రాయెల్‌లో దింపమని అతగాడిని కోరింది. అక్కడే వుంది అసలు కిటుకు…

తరువాత జరిగింది ఇదే.!

తన భార్య, పిల్లల్ని అక్కడ వదిలేసి తిరుగు ప్రయాణం కోసం అతగాడు విమానాశ్రయానికి చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పోలీసులు రావడం, అతన్ని పట్టుకుపోవడం జరిగింది. కట్ చేస్తే.. ఇజ్రాయల్ కోర్టు తమ ఇజ్రాయెల్ యువతిని పెళ్లి చేసుకొని వదిలేసినందుకు అతగాడికి 9999 సంవత్సరం వరకూ ఇజ్రాయెల్‌ ని విడిచి పెట్టి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తీర్పు వెల్లడించింది. లేని యెడల అతనికి అంతకంటే ఘోరమైన శిక్ష తప్పదని హెచ్చరించింది. విషయం తెలిసిన నెటిజన్లు ఇంతకంటే ఘోరమైన శిక్ష ఇంకేముంటుంది అని అతగాడిపైన జాలి చూపిస్తున్నారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago