మార్కెట్లో సరికొత్త వాహనాలను విడుదల చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటున్న సంస్థ బజాజ్..! తన ప్లాటినా లైనప్ లేటెస్ట్ కంమ్యూటర్ మోటార్ సైకిల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది..! తాజాగా భారత మార్కెట్లో బజాజ్ కిక్ స్టార్ట్ 100KS బైక్ ను లాంచ్ చేసింది..! కిక్ స్టార్ట్ తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ వాహనప్రియులను ఆకట్టుకుంటుంది..! ఈ బైక్ స్టైల్, ఫీచర్స్, మైలేజ్ ఇలా ఉన్నాయి..
ఫీచర్స్
100సీసీ ఎయిర్ కూల్డ్SOHC సింగిల్ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంది. 7.5 బిహెచ్పి బ్రేక్స్ హార్స్ పవ,ర్ 8.4 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా స్పీడ్ స్థిరమైన మెష్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పని చేస్తుంది. 11 లీటర్ల ట్యాంకు ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా లీటర్కు గరిష్టంగా 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని బరువు 117 కేజీలు.
స్పెసిఫికేషన్స్ :
ఈ మోటార్ సైకిల్ ను సరికొత్త ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. హెడ్ ల్యాంప్ క్లస్టర్, క్వి ల్ట్ సీట్లు, సరికొత్త డిజైన్ చేసిన ఇండికేటర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇంకా హ్యాండ్ గాడ్, ప్రొటెక్టివ్ ట్యాంక్ ప్యాడ్, వైడ్ రబ్బర్ ఫుడ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఫ్రంట్ హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫోర్కులు, డ్యూయల్ కాయిల్ స్ప్రింగ్స్ షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి. 130mm ఫ్రంట్, 110mm రియర్ డ్రమ్స్ బ్రేక్స్ కలిగి ఉంది. ఇది హీరో స్ప్లెండర్ కు ప్రత్యర్థిగా నిలవనుంది. ఇది రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.51, 667.