Girl Child సూపర్ న్యూస్ : ఆడపిల్ల పుడితే 10వేలు .. ఇలా అప్లయ్ చేసుకోండి

Share

Baby girl: ఆడపిల్ల పుట్టిందంటే చాలు.. చాలా మంది వారిని వదిలించుకునేందుకు చేసే ప్రయత్నాలు మనం చూస్తూనే ఉంటున్నాం. ఆడపిల్ల ఇష్టం లేని వారి తమకు పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో వదిలి వెలుతున్న ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వీటిని నివారించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. తమ గ్రామంలో ఇలాంటి వాటిని నివారించేందుకు ఓ గ్రామ సర్పంచ్ ముందడుగు వేశాడు. ఆ గ్రామంలో ఆడపిల్లలకు రూ.10 వేలు ఇస్తానంటూ ప్రకటించారు. ఆడపిల్లలను కాపాడేందుకు తన వంతుగా సహకారం అందిస్తున్నారు.

అకౌంట్‌లో రూ.10 వేలు

వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ మండల పరిధిలోని మరియపురం గ్రామ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఆడపిల్లలకు అండగా నిలుస్తున్నారు. ఆయన గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. గ్రామాన్ని తన సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తున్న ఈ సర్పంచ్.. అందరి మన్ననలు పొందుతున్నారు. గ్రామంలో ఆడపిల్ల పుడితే వారికి తన తరపున రూ.10 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడ పిల్లల పేరుతో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఈ డబ్బును అందులో డిపాజిట్ చేయనున్నట్టు వెల్లడించారు. నిర్మల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న బాలిరెడ్డి.. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.

పదవిలో ఉన్నంత కాలం..

ఇప్పటి వరకు గ్రామంలో సుమారు ఎనిమిది మంది ఆడపిల్లలు పుట్టారు. వీరికి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు అందులో డిపాజిట్ చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. తాను సర్పంచ్ పదవిలో కొనిసాగినంతకాలం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటూ ఆయన చెప్పారు. నిర్మల చారిటబుల్ ట్రస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈనెల 20న బాలికల పేరెంట్స్‌కు డిపాజిట్ పత్రాలు అందజేయనున్నట్టు ప్రకటించారు. గ్రామంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత నిధులు ఉపయోగించి అనేక అభివృద్ధి పనులు చేపట్టి గ్రామ సమస్యలు తీరుస్తున్నారు బాలిరెడ్డి.


Share

Related posts

బ్రేకింగ్ : త్వరపడండి – ఆ ఫ్లయిట్ ఎక్కితే 25% డిస్కౌంట్

Vihari

అంత అవ‌మానిస్తారా… హ‌రీశ్ రావు పేరు చెప్పి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

sridhar

Oxygen Express Trains: పరుగులు పెట్టనున్న “ఆక్సిజన్ ఎక్స్ప్రెస్” ట్రైన్స్..!!

bharani jella